ఆ విషయంలో ….బాబు మౌనం వెనక …?
చంద్రబాబు డబ్బాలా మాట్లాడుతారు అని అంటారు. కానీ ఆయన ఊరికే ఏదీ మాట్లాడరు. ఎక్కడ ఏది ఎక్కువ మాట్లాడాలో, మరెక్కడ మౌనంగా ఉండాలో ఆయన బాగానే తూకమేసుకుంటారు. [more]
చంద్రబాబు డబ్బాలా మాట్లాడుతారు అని అంటారు. కానీ ఆయన ఊరికే ఏదీ మాట్లాడరు. ఎక్కడ ఏది ఎక్కువ మాట్లాడాలో, మరెక్కడ మౌనంగా ఉండాలో ఆయన బాగానే తూకమేసుకుంటారు. [more]

చంద్రబాబు డబ్బాలా మాట్లాడుతారు అని అంటారు. కానీ ఆయన ఊరికే ఏదీ మాట్లాడరు. ఎక్కడ ఏది ఎక్కువ మాట్లాడాలో, మరెక్కడ మౌనంగా ఉండాలో ఆయన బాగానే తూకమేసుకుంటారు. చంద్రబాబు ఈ విషయంలో చాలా నిపుణుడు అని చెప్పాలి. ఆయన మాట్లాడిన ప్రతీ మాట వెనకా ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడకపోవడం వెనక కూడా ఒక పరమ ఉద్దేశ్యం ఉంటుంది. ఇదంతా ఇపుడు ఎందుకంటే చంద్రబాబు మీద నేరుగానే ముఖ్యమంత్రి జగన్ అతి పెద్ద అభాండం వేశారు. ఆయన తన చేతులలోకి వ్యవస్థలను తీసుకుని మొత్తానికి మొత్తం ఆటాడిస్తున్నారు అన్నది జగన్ ప్రధాన ఆరోపణ. దాన్ని ఆయన ఎక్కడా దాచుకోకుండా తన సలహాదారు అజేయ కల్లాం ద్వారా బహిర్గతం చేశారు. మరి ఇంత నింద తనమీద పడ్డాక చంద్రబాబు ఎలా రియాక్ట్ కావాలి.
ఫుల్ సైలెంట్ గా …
కానీ చంద్రబాబు చాలా ఆశ్చర్యకరంగా ఆ ఒక్క విషయంలో సైలెంట్ అయ్యారు. ఆయన అమరావతి రాజధాని కోసం ఉద్యమించాలి అని ప్రతీ రోజూ పిలుపు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ ఏమీ చేయలేదని విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ఆయన అసలు విషయం మాత్రం చెప్పడంలేదు. కనీసం సింగిల్ వర్డ్ కూడా చంద్రబాబు నోట రావడంలేదు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో మీడియాకు సైతం తెలియడం లేదు. జగన్ పెట్టిన చిచ్చు చిన్నదా. ఆయన ఏకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మొత్తం తన అనుమానాలూ సందేహాలు ఒక లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్య పాత్రధారుడు చంద్రబాబు అన్నది లోకానికి తెలుసు. మరి చంద్రబాబు దీని మీద నా తప్పు లేదనో, నన్నెందుకు జగన్ ఇరికిస్తున్నాడు అనో గట్టిగా గదమాయించాలి కదా. కానీ ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో మరి.
పక్కా వ్యూహంతోనే …..
నిజానికి చంద్రబాబు పెదవుల మీద అమరావతి రాజధాని, మూడు వందల రోజులు అంటున్నారు కానీ ఆయన మనసులో మాత్రం వేరే టాపిక్స్ కలియతిరుగుతూనే ఉంటాయి. అయితే రాజకీయ చాణక్యుడు కాబట్టి పెదవి దాటనీయకుండా జాగ్రత్తపడుతూ ఉంటారని అంటున్నారు. ఇక ఈ సమయంలో తాను బయటపడి రచ్చ చేసినా విమర్శలు చేసినా భుజాలు తడుముకున్నట్లుగా ఉంటుందన్న అతి తెలివితోనే చంద్రబాబు తన నోటికి తాళం వేసుకుని ఉండొచ్చు అన్న మాట కూడా ఉంది. అదే విధంగా తాను ఎందుకు బయటపడాలి. జగన్ లేఖ రాసింది తనకు కాదు, ఆరోపణలు వేరే వారి మీద చేశారు. అక్కడ తీర్పు ఎలా వస్తుందో తెలియదు, ఈ నేపధ్యంలో తాను మధ్యన బుర్ర పెట్టి రోకలి పోటు ఎందుకు భరించాలి అన్న తెలివిడి వల్ల కూడా చంద్రబాబు మిన్నకుండి ఉండవచ్చు అని అంటున్నారు.
దొరుకుతాడనా…?
ఇక జగన్ దూకుడు రాజకీయం చంద్రబాబుకు బాగా తెలుసు కానీ మరీ ఇంతలా ఆయన దూసుకుపోతాడని మాత్రం బాబు అసలు ఊహించి ఉండరు. దాంతో కొంత షాక్ కి గురి అయినా ఉండాలి. ఆ మీదట తేరుకుని కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు అన్న ఆలోచనతోనైనా చంద్రబాబు గమ్మున్న ఉండాలి. ఏది ఏమైనా బాబు ఈ విషయంలో తన పాదరసం లాంటి తన బుర్రకు పదును పెట్టకుండా ఉండరు అని అంటున్నారు. అయితే ఇది సమయం కాదు, తాను సీన్ లోకి రావడం అంతకంటే మంచిది కాదు అని కూడా బాబు ఆలోచనతోనే అలా ఉన్నారని విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా జగన్ కోరి తెచ్చిపెట్టుకున్న ఈ చిచ్చు ఎటువైపునకు పాకుతుందో గమనించిన మీదటనే చంద్రబాబు పవర్ ఫుల్ రియాక్షన్ ఉంటుంది. అది చాలా వైల్డ్ గా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ప్రస్తుతానికి బాబు ఒక మౌన మౌని మాత్రమే. అంతే కాదు మౌన ప్రేక్షకుడు కూడా.

