చాన్నాళ్ల తర్వాత చంద్రబాబులో…?
అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన అనుభవం అంత వయసు లేని జగన్ ఇక్కడ సీఎంగా ఉన్నారు. జగన్ ఎన్ని పధకాలు ప్రవేశపెట్టి ఎంతగా కష్టపడితే లాభమేంటి. ఒక్క [more]
అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన అనుభవం అంత వయసు లేని జగన్ ఇక్కడ సీఎంగా ఉన్నారు. జగన్ ఎన్ని పధకాలు ప్రవేశపెట్టి ఎంతగా కష్టపడితే లాభమేంటి. ఒక్క [more]

అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన అనుభవం అంత వయసు లేని జగన్ ఇక్కడ సీఎంగా ఉన్నారు. జగన్ ఎన్ని పధకాలు ప్రవేశపెట్టి ఎంతగా కష్టపడితే లాభమేంటి. ఒక్క దెబ్బకు చిత్తు చేసేస్తున్నారు చంద్రబాబు. ఇదిలా ఉండగా చాన్నాళ్ళ తరువాత బాబులో ఇపుడు నవ్వు కనిపిస్తోందని తమ్ముళ్ళు అంటున్నారు. గత రెండేళ్ళుగా అన్నీ ఓటములే కానీ గెలుపు రుచి చూడని బాబుకు లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడడం భారీ ఊరటని ఇచ్చాయట. ఈ ఆరు వారాల టైం చాలు, రఫ్ఫాడించేస్తానని అంటున్నారుట.
సెంటిమెంట్ తో ….
ఇక జగన్ ని సెంటిమెంట్ తో కొట్టాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం ఆవహించి ఉంది. దాన్ని ఎంత వీలైతే అంతగా క్యాష్ చేసుకునేందుకు టీడీపీ శిబిరం రెడీ అయిపోయింది. బాబు అయితే ప్రతీ రోజూ కనీసం రెండు సార్లు అయినా మీడియా మీటింగులు పెడుతూ కరోనా పైన లెక్చర్లు దంచుతున్నారు. మధ్యలో నిపుణులను కూడా లాగుతున్నారు. ఎక్కడ ఏ రోజు ఎవరు కరోనా వల్ల చనిపోయిందీ చంద్రబాబు లెక్కలు చెప్పేస్తున్నారు. ఆ విధంగా ఓ వైపు కరోనా భయాన్ని పెంచుతూనే మరో వైపు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హిత వచనాలు పలుకుతూ జనాలకు దగ్గరవాలనుకుంటున్నారు. ప్రజలలో ఇపుడు కరోనా కంటే మించిన భయం లేదు, అదే సెంటిమెంట్ ని పెట్టుకుని జగన్ ని దెబ్బ కొట్టాలన్నది భారీ ప్లాన్ గా ఉంది.
జనం ప్రాణాలతో….
కరోనా ఓ వైపు వీర విహారం చేస్తూంటే ఈ ముఖ్యమంత్రికి అసలు పట్టడంలేదు. ఆనాడు నేను డెంగ్యూ విషయంలో ఎంతో పోరాడాను, దాని వల్ల దోమలు తగ్గి చాలా రోగాలు అదుపులోకి వచ్చాయని తన గత పాలనా వైభవాన్ని చంద్రబాబు వల్లిస్తున్నారు. ఇపుడు కరోనా వంటి భయంకరమైన వైరస్ ముంచుకు వస్తే జగన్ కి కనీసం శ్రద్ధ లేదని, జనాల ప్రాణాలు పోయినా బాధలేదని, ఆయన వట్టి మూర్ఖుడని, ఏమీ తెలియదని చంద్రబాబు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఓ విధంగా జనాన్ని జగన్ కి యాంటీగా ఎగదోస్తున్నారు.
అప్పటివరకూ అట….
ఏపీలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద కరోనా భయం లేదు అని చెప్పేంతవరకూ జనం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అంటున్నారు. అంతవరకూ ఎన్నికలు కూడా జరపరాదన్నది చంద్రబాబు మరో ఆలోచనగా ఉంది. అంటే కరోనా వైరస్ కు మందు కనిపెట్టి అది ఫలించి ఆ మహమ్మారి వల్ల ఇక భయం లేదు అన్నంతవరకూ ఏపీలో స్థానిక ఎన్నికలు పెట్టవద్దని బాబు చెప్పకనే చెప్పేస్తున్నారు. మరి ఇంతటి గట్టి అజెండా ఉంది కాబట్టే ఎన్నికలను అలా వాయిదా వేయించేశారు. కరోనా భయం లేదని ఇప్పట్లో ఎవరైనా చెప్పగలరా. అంటే లోకల్ బాడీ ఎన్నికలు ఎపుడు జరుగుతాయో కూడా ఎవరూ చెప్పలేరన్న మాట. మొత్తానికి చంద్రబాబు పెద్ద ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారనుకోవాలి.

