అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందేనా?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగాలేదు. ఒక్క నాయకుడు వెళ్లినా వంద మందినాయకులను తయారు చేసే కార్ఖానా టీడీపీ అని చంద్రబాబు పైకి చెబుతున్నా లోపల [more]
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగాలేదు. ఒక్క నాయకుడు వెళ్లినా వంద మందినాయకులను తయారు చేసే కార్ఖానా టీడీపీ అని చంద్రబాబు పైకి చెబుతున్నా లోపల [more]

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగాలేదు. ఒక్క నాయకుడు వెళ్లినా వంద మందినాయకులను తయారు చేసే కార్ఖానా టీడీపీ అని చంద్రబాబు పైకి చెబుతున్నా లోపల మాత్రం బెరుకుగానే ఉంది. ఉన్న నేతలు పార్టీని విడిచి వెళ్లిపోతే కొత్త నేతలను తయారు చేయడం అంత ఈజీకాదు. వారు క్యాడర్ తో మింగిల్ అవ్వాల్సి ఉంటుంది. క్యాడర్ కూడా వారిని నమ్మాల్సి ఉంటంుది. టీడీపీకి బలమైన క్యాడర్ ఉండటంతో ఎవరి నాయకత్వాన్ని అంగీకరించమంటే అంగీకరించబోరన్న వ్యాఖ్యలు కూడా పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.
కేసులకు భయపడి…..
కేసులకు భయపడి నేతలు, క్యాడర్ ఇప్పటి వరకూ బయటకు రావడం లేదు. క్యాడర్ మాత్రం టీడీపీకి ఏపీలో చెక్కు చెదరకుండానే ఉందన్న ధీమా చంద్రబాబులో ఉంది. ఒకరకంగా అది నిజం కూడా. తొలి నుంచి టీడీపీతో ఉన్న క్యాడర్ వైసీపీకి మరలడం చాలా కష్టం. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి కొనసాగుతున్న క్యాడర్ అది. అంత సులువుగా బయటకు పోదు. కానీ మధ్యలో పార్టీలోకి వచ్చిన వారే ఎక్కువగా వెళ్లిపోతున్నారు.
ముందు మంచి రోజులు….
కానీ టీడీపీకి మంచిరోజులు ముందు ఉన్నాయన్నది అధినేత చంద్రబాబు అంచనా. ఇప్పటికే వైసీపీ పాలనపై కొన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు విద్యావంతులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను అప్పులు తెచ్చి మరీ ఎంతకాలమో కొనసాగించలేరన్నది చంద్రబాబు నమ్మకం. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక యువత కూడా జగన్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు.
వైసీపీలో అసంతృప్తులు పెరిగితే?
దీనింతటి కంటే మరో ముఖ్యమైన విషయం. వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోవడం. కొద్దికాలం నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో అసంతృప్తి పెరిగిపోయిందన్నది వాస్తవం. ఇప్పటికే నేతలకు పదవులు లేక అసహనంతో ఉన్నారు. ఇది ఎంతకాలమో దాగదన్నది చంద్రబాబు అంచనా. ఇదే జరిగితే తమకు అడ్వాంటేజీగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పి వరకూ వెయిట్ చేయాల్సిందేనని చంద్రబాబు సీనియర్ నేతల ఎదుట వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

