బాబు ఆ హామీ ఇస్తే సైకిల్ పరుగేనా ?
చంద్రబాబులో ఉన్న అతి పెద్ద మైనస్. ఏ నిర్ణయం అయినా చాలా లేట్ గా తీసుకుంటారని. ఆయన రిస్క్ కి కూడా దూరంగా ఉంటారని, నిజానికి రాజకీయం [more]
చంద్రబాబులో ఉన్న అతి పెద్ద మైనస్. ఏ నిర్ణయం అయినా చాలా లేట్ గా తీసుకుంటారని. ఆయన రిస్క్ కి కూడా దూరంగా ఉంటారని, నిజానికి రాజకీయం [more]

చంద్రబాబులో ఉన్న అతి పెద్ద మైనస్. ఏ నిర్ణయం అయినా చాలా లేట్ గా తీసుకుంటారని. ఆయన రిస్క్ కి కూడా దూరంగా ఉంటారని, నిజానికి రాజకీయం అంటేనే బిగ్ రిస్క్. ప్రజల మూడ్ ఎపుడు ఎలా మారుతుందో దేవుడికే తెలియాలి. అది అలా ఉంటే తన చుట్టూ ఉన్న పార్టీ మూడ్ అయినా సరిగ్గా ఉండేలా రధ సారధి చంద్రబాబు చూసుకోవాలి కదా. ఇప్పటికీ బాబుని క్యాడర్ నమ్మడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయటే చంద్రబాబు అపర చాణక్యం మీద ఆయనకే అనుమానాలు వస్తున్నాయి కదా.
ఇది చాలదుగా…..
మొత్తానికి చంద్రబాబు జగన్ రూట్లోకి వచ్చేశారు. జగన్ విపక్షంలో ఉండగా పార్లమెంటుకు ఒక ప్రెసిడెంట్ అన్న థియరీని అమలు చేశారు. అప్పటికి టీడీపీ ఇంకా పదమూడు జిల్లాల పార్టీగానే ఉంది. కానీ జగన్ మాత్రం కొత్త దారిని కనుగొన్నారు. అది బాగానే కలసివచ్చింది. పార్టీ అధికారాలు వికేంద్రీకరించబడ్డాయి. దాంతో పటిష్టతకు, జనాలకు రీచ్ కావడానికి కూడా ఉపయోగపడింది. చివరికి అది వైసీపీకి బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టింది. ఇపుడు జగన్ ని తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు కూడా ఇదే సరైన ఫార్ములా అంటూ పాతిక మంది సారధులకు పార్టీ పట్టం కట్టారు. కానీ ఇది సరిపోతుందా అన్నదే ప్రశ్న.
బోయీలేనా….
నిజానికి చంద్రబాబు జమానాలో ముమ్మారు అన్యాయం అయిపోయామని ఇప్పటికీ పార్టీ నాయకులు ఆక్రోశిస్తూ ఉంటారు. విపక్షంలో ఉన్నపుడు తమను అడ్డంగా వాడేసుకుని అనేక రకాల హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోతారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక చంద్రబాబు కూడా ఓడిపోయాకనే నేతలను పట్టించుకుంటారు. పాత తప్పులు మళ్ళీ చేయను అంటూ ఎన్ని ఓట్లు అయినా వేస్తారు. ఇది మళ్ళీ మరోసారి జరుగుతోందిపుడు. బాబు తాజాగా అనేక జిల్లా పార్టీ నేతలతో వీడియో సమావేశాల ద్వారా మాట్లాడుతూ తాను గతంలో తప్పులు చేశానని ఒప్పుకున్నారు. ఈసారి పార్టీకి గట్టిగా పనిచేయండి, మీకే అందలాలు అంటూ నోటితోనే హామీలు ఇస్తున్నారు. కానీ నమ్మడానికి మాత్రం ఇపుడు ఎవరూ పెద్దగా సిద్ధపడదంలేదని అంటున్నారు.
టికెట్లు ఇస్తారా….?
చంద్రబాబు పార్లమెంట్ కో ప్రెసిడెంట్ ని పెట్టి బాధ్యతలు అప్పగించారు. వారు మరో మూడున్నరేళ్ళు గట్టిగా పనిచేస్తే పార్టీకి మంచి రోజులు వస్తాయి. కానీ వారిలో చంద్రబాబు మీద అపనమ్మకమే ఉత్సాహాన్ని చంపేస్తోంది. అటువంటి వారికి ఇపుడు బోల్డ్ గా బాబు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. బాగా పనిచేసిన ఇంచార్జులకు, పార్టీ ముఖ్యులకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టికెట్లు ఇస్తామని చంద్రబాబు కనుక చెబితే ఆ హామీతో వారంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. వైసీపీ మీద దూకుడు రాజకీయమే చేస్తారు. కానీ బాబు వైఖరి చూసిన వారికి ఆ రకమైన హామీ ఇస్తారా అంటే డౌటే అంటున్నారు. పార్టీ పదవులు బీసీలు, కాపులు దళిత వర్గాలకు ఇచ్చిన బాబు రేపటి ఎన్నికల్లో వీరికే టికెట్ ఇస్తాను అని నిబ్బరంగా చెబితేనే సైకిల్ స్పీడ్ పెరుగుతుందని అంటున్నారు.

