ఓర్చుకో బాబూ…ఓడినా ఇంతేనా ?
చంద్రబాబుకు ఒకరు చెప్పాల్సింది లేదు. ఆయనకు అన్నీ తెలుసు కానీ. ఏమీ తెలియనట్లుగా ఆయన వ్యవహరించడమే వింతలోకెల్లా వింతా. ప్రతిపక్ష నాయకుడు అనగానే ఎక్కడ లేని మాటలూ [more]
చంద్రబాబుకు ఒకరు చెప్పాల్సింది లేదు. ఆయనకు అన్నీ తెలుసు కానీ. ఏమీ తెలియనట్లుగా ఆయన వ్యవహరించడమే వింతలోకెల్లా వింతా. ప్రతిపక్ష నాయకుడు అనగానే ఎక్కడ లేని మాటలూ [more]

చంద్రబాబుకు ఒకరు చెప్పాల్సింది లేదు. ఆయనకు అన్నీ తెలుసు కానీ. ఏమీ తెలియనట్లుగా ఆయన వ్యవహరించడమే వింతలోకెల్లా వింతా. ప్రతిపక్ష నాయకుడు అనగానే ఎక్కడ లేని మాటలూ పేర్చేసి ఆధారాలు లేని ఆరోపణలు చేసేసి చెలరేగిపోవడమే అని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇది కూడా ఆయన అన్నీ తెలిసే అమలు చేస్తున్న వ్యూహం. గత ఏడాదిన్నర కాలంలో ఆయన నోరు జగన్ ని విమర్శించకుండా ఎపుడు ఖాళీగా ఉందని. తెల్లారిలేస్తే జగన్ మీద పెద్ద నోరు వేసుకుని విరుచుకుపడిపోవడం చంద్రబాబుకు అలావాటుగా మారింది. కానీ జనాలు మాత్రం ఆయన మాటలను పెద్దగా పట్టించుకోకపోవడం విషాదమే.
యావ తెలుస్తోందిగా ….
చంద్రబాబుకు పదవి మీద యావ ఎంతో అందరికీ తెలిసిందే. తన సొంత మామ ఎన్టీయార్ కొలువులో మంత్రిగా ఉంటూనే మామ గారి ఏలుబడి మీద అనుకూల మీడియాలో కామెంట్స్ చేయించారు చంద్రబాబు అంటారు. ఇక ఆయనకు మంట పుట్టించే వైఎస్సార్ కుటుంబం గద్దె మీద కూర్చుంటే చూస్తూ ఊరుకుంటారా. అంతేనా తనను కేవలం 23 సీట్లకు కుదించేసి జగన్ అలా వెలిగిపోవడం చంద్రబాబు లాంటి వారు అసలు తట్టుకోలేరు. ఆయన రాజకీయాన్ని చూసిన వారంతా ముక్త కంఠంతో చెప్పే మాట ఇదే. కానీ అది ఇపుడు ప్రతీ రోజూ ఒక అక్కసుగా బయటపడిపోతోందే.
తెగించేసారా…?
ఇక ఇంతకంటే గ్రాఫ్ పడిపోయేది ఏదీ లేదు. అవును కదా తెలుగుదేశం పుట్టాక ఇంత ఘోర అవమానం ఏదీ చరిత్ర చూసి ఎరగదు, అందువల్ల రేపటి ఎన్నికల్లో 23 సీట్ల కంటే తక్కువ వస్తాయని చంద్రబాబు అనుకోవడంలేదు. పెరిగితే పెరగాలి కానీ మరీ ఇలా పడిపోము అన్న లెక్కలేవో ఆయనకు ఉండాలి. అందుకే చంద్రబాబు ఒక విధంగా తెగించేశారను అంటున్నారు. జగన్ ని రోజూ తిడితే రాజకీయంగా ఎంతో కొంత లాభం ఉంటుందే తప్ప నష్టం రాదు అన్నది చంద్రబాబు మార్క్ ఫిలాసఫీగా ఉందిట. పైగా ఒక ప్రభుత్వం మీద జనాల ఆశలు రోజురోజుకీ తగ్గి ఆ ప్లేస్ లో వ్యతిరేకత వస్తుందని, దానికి తగినట్లుగా యాక్ట్ చేస్తే ఆ ఓటు బ్యాంక్ తమ వైపు మళ్ళుతుందని కూడా చంద్రబాబు భావిస్తున్నారుట.
ఇమేజ్ డ్యామేజ్……
సరే ఈ రాజకీయ లెక్కలతో రంకెలు వేయడం బాగానే ఉంది కానీ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ప్రధాని రేసులో ఉన్న నేత. అటువంటి ఆయన తన కొడుకుతో సమానం అయిన జగన్ తో రోజూ గిల్లికజ్జాలు పెట్టుకోవడాన్ని ఎవరూ సహించలేరు. ఇక తన అనుభవం అపారం అంటున్న చంద్రబాబు జగన్ సర్కార్ కి సరైన సలహాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు అన్న మాట ఉంది. మరో వైపు ఏపీ ప్రయోజనాలకు కాపాడాల్సిన బాధ్యత బాబుకు లేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జగన్ తెలిసో తెలియకో తప్పులు చేస్తే వాటి నుంచి రాజకీయ లాభాన్ని జుర్రుకుందామన్న తాపత్రయం తప్ప ఏపీ మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అన్న చర్చ కనుక జనాల్లో గట్టిగా వెళ్తే ఆయన వైసీపీ కి సర్కార్ కి పెడుతున్న శాపనార్ధాలే రేపటి రోజుల ముళ్ళ బాట పరుస్తాయి మరి.

