పనికి రారనుకున్న వారే నేడు పనికొస్తున్నారు
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారయింది. చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు రెస్పాన్స్ లేకుండా పోయింది. అయితే ద్వితీయ శ్రేణినేతలు మాత్రం పార్టీలో యాక్టివ్ గా కన్పిస్తున్నారని [more]
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారయింది. చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు రెస్పాన్స్ లేకుండా పోయింది. అయితే ద్వితీయ శ్రేణినేతలు మాత్రం పార్టీలో యాక్టివ్ గా కన్పిస్తున్నారని [more]

తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారయింది. చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు రెస్పాన్స్ లేకుండా పోయింది. అయితే ద్వితీయ శ్రేణినేతలు మాత్రం పార్టీలో యాక్టివ్ గా కన్పిస్తున్నారని చంద్రబాబు గుర్తించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతలు, గెలిచిన లీడర్లు పత్తా లేకుండా పోయినా నియోజకవర్గంలో చోటా మోటా నేతలు మాత్రం పార్టీ జెండాను పట్టుకుని వీధుల్లోకి రావడం శుభపరిణామంగానే కన్పిస్తుంది.
అనేక కార్యక్రమాలు చేపట్టినా….
తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇందులో ప్రధాన నాయకులు ఎవరూ పాల్గొనడం లేదు. అందరూ మొహం చాటేస్తున్నారు. కార్కక్రమాల సంగతి దేవుడెరుగు. చంద్రబాబు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు కూడా కొందరు నేతలు హాజరు కావడం లేదు. ఇది చంద్రబాబు కు ఆగ్రహం తెప్పిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి.
కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం…
అయితే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న నేతలు మాత్రం పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్నట్లు చంద్రబాబు గుర్తించారు. తాను పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఎవరెరెవరు పాల్గొన్నారన్నది కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రతి నేత తాను చేసిన కార్యక్రమాన్ని ఫొటో, వీడియోలను విధిగా కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటినీ పరిశీలించినప్పుడు ప్రధాన నేతల కన్నా ద్వితీయ శ్రేణి నేతల భాగస్వామ్యమే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
ద్వితీయశ్రేణి నేతలతో నేరుగా…..
దీంతో తాను పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొన్న ద్వితీయ శ్రేణి నేతల పేర్లను చంద్రబాబు కేంద్ర కార్యాలయం నుంచి సేకరించారు. వారికి నేరుగా ఫోన్లు చేయడమా? లేక మెసేజ్ లు పంపడమా? లేక లేఖ రాయడమా? అన్నదానిపై ఇంకా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. నేరుగా వారికి మెసేజ్ లు పెడితే మరింత ఉత్సాహంతో పార్టీకోసం పనిచేస్తారని, మెసేజ్ లతో పాటు లెటర్ కూడా రాయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం నాడు పనికి వస్తారని భావించిన నేతలు నేడు పనికి రాకుండా పోయారు.

