కదలలేరు.. మెదల లేరు… కాలక్షేపం అలా
తెలుగుదేశం పార్టీ అధనేత చంద్రబాబుకు ఇప్పుడు రెండు సమస్యలున్నాయి. ఒకటి జగన్ నుంచి పార్టిని రక్షించుకోవడం. రెండు కరోనా నుంచి సురక్షితంగా బయటపడటం. మొదటిది తన చేతులో [more]
తెలుగుదేశం పార్టీ అధనేత చంద్రబాబుకు ఇప్పుడు రెండు సమస్యలున్నాయి. ఒకటి జగన్ నుంచి పార్టిని రక్షించుకోవడం. రెండు కరోనా నుంచి సురక్షితంగా బయటపడటం. మొదటిది తన చేతులో [more]

తెలుగుదేశం పార్టీ అధనేత చంద్రబాబుకు ఇప్పుడు రెండు సమస్యలున్నాయి. ఒకటి జగన్ నుంచి పార్టిని రక్షించుకోవడం. రెండు కరోనా నుంచి సురక్షితంగా బయటపడటం. మొదటిది తన చేతులో లేదు కాని, రెండోది మాత్రం ఆయన ఆచరణలో చేసి చూపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాదాపు నెల రోజులు దాటుతుంది. గత నెలలో రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు.
నెల రోజుల నుంచి…..
అప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. తనకు హైదరాబాద్ సురక్షితమని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతి కరకట్ట మీద నివాసం కరోనా సమయంలో సేఫ్ కాదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. వచ్చే పోయే నేతలతో పాటు సిబ్బంది ద్వారా కూడా కరోనా వ్యాప్తి సోకే అవకాశముంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతోనే కరోనా ఉధృతి తగ్గేంత వరకూ ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వెళ్లి చేసేదేముంది?
పైగా ఇప్పటికిప్పుడు అమరావతికి వెళ్లి చేసేదేమీ లేదు. కరోనా ఆంక్షల కారణంగా ఎక్కడికీ తిరిగేందుకు వీలులేదు. పార్టీ కార్యాలయం, నివాసానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ మాత్రం దానికి అమరావతి ఎందుకు? హైదరాబాద్ లోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించవచ్చన్న అభిప్రాయంతోనే చంద్రబాబు ఇక్కడే ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిత్యం పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ప్రధాన అంశాలపై లేఖలు రాస్తున్నారు. సమస్యలపై ట్విట్టర్ లో స్పందిస్తున్నారు.
ఈ ఏడాది మొత్తం…..
ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. యాభై వేలకు చేరువలో కేసులున్నాయి. దీంతో చంద్రబాబు మరికొద్దికాలం పాటు హైదరాబాద్ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. దీంతో పాటు తాను స్థాపించిన సంస్థ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. నిత్యం మేధావులు, నిపుణులతో ఆయన చర్చిస్తున్నారు. కరోనా వైరస్ ఈ ఏడాది చివరి వరకూ తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవు. దీంతో చంద్రబాబు అప్పటి వరకూ హైదరాబాద్ లో కాలక్షేపం చేయాల్సిందేనా? లేక జిల్లాల పర్యటన చేస్తారా? అన్నది పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. 2019 సంవత్సరం చంద్రబాబుకు ఎన్నికలతో అచ్చిరాలేదు. 2020 కరోనాతో కలసి రాకుండా పోయింది.

