సక్సెస్ రేట్ పడిపోవడానికి..?
పోయిన క్రెడిట్‌ను తిరిగి రాబట్టుకోవాలి. తన పాలనానుభవాన్ని మరోసారి నిరూపించుకోవాలి. ముఖ్యంగా అపర చాణిక్యుడిగా తన రాజకీయ తంత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇదీ ఏపీ మాజీ సీఎం [more]
పోయిన క్రెడిట్‌ను తిరిగి రాబట్టుకోవాలి. తన పాలనానుభవాన్ని మరోసారి నిరూపించుకోవాలి. ముఖ్యంగా అపర చాణిక్యుడిగా తన రాజకీయ తంత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇదీ ఏపీ మాజీ సీఎం [more]

పోయిన క్రెడిట్‌ను తిరిగి రాబట్టుకోవాలి. తన పాలనానుభవాన్ని మరోసారి నిరూపించుకోవాలి. ముఖ్యంగా అపర చాణిక్యుడిగా తన రాజకీయ తంత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇదీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆలోచనా సరళి, ప్రణాళికల వ్యూహం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా.. ప్రజల్లో పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే, చంద్రబాబుకు ఈ గెలుపు, ఓటములను మించిన సమస్య మరొకటి వెంటాడుతోంది. అదే పార్టీ మనుగడ. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పటివరకు చాలా మంది కీలక నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
నిస్తేజంగా ఉన్న సమయంలో….
గత హయాంలో పార్టీలో పదవులు అనుభవించిన నాయకులు కూడా ఇప్పుడు చంద్రబాబు చెంతకు కూడా రావడం లేదు. దీనికితోడు పార్టీలోని కొందరు నాయకులు జంపిగులకు తెరదీశారు. దీంతో ఇటు తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే .. పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం, నాయకులను నిలబెట్టుకోవాల్సిన అగత్యం రెండూ కూడా చంద్రబాబుపై ఉన్నాయి. దీంతో చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో యుద్ధాలకు పిలుపునిస్తున్నారు. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు మాసాల వరకు ఏం చేయాలో కూడా చంద్రబాబుకు ఆలోచన తట్టలేదు.
విఫల సీఎంగా….
ఎన్నికల సమయంలో పసుపు-కుంకుమ అంటూ.. మహిళలకు, అన్నదాత సుఖీభవ అంటూ రైతులకు డబ్బులు పంచినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో అసలు ఏం జరిగింది? అనే ఆలోచన నుంచి తేరుకునేందుకే చంద్రబాబు సమయం పట్టేసింది. ఈ క్రమంలోనే ఆయన జగన్ సర్కారు వైఫల్యాలపై కొరడా ఝళిపిస్తానంటూ.. రోడ్డెక్కారు. మళ్లీ ఇందులోనూ రెండు ప్రయోజనాలను చంద్రబాబు ఆశించారు. ఒకటి.. జగన్‌పై నిందలు వేయడం ద్వారా.. ఆయనను విఫలమైన సీఎంగా నిలబెట్టడం, రెండు.. అనుభజ్ఞుడైన సిఎంను పోగొట్టుకున్నామనేలా ప్రజల్లో చర్చ పెట్టడం.
పాత వాసనలను….
ఈ రెండు లక్ష్యాలుగా ఆయన జగన్ ప్రభుత్వంపై అనేక రూపాల్లో చంద్రబాబు యుద్దం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆత్మకూరు, నిన్నటి వరకు తన ఇంటిని కూల్చేసేందుకు జగన్ సర్కారు కుట్ర పన్నిందనే ప్రచారం. నేడు ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలు, రేపు తెలుగు భాష ఇలాగట్టి ప్రణాళికతోనే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. అయితే, ఎంతలేదన్నా.. గత పాలన తాలూకు వాసనలు ఆయనను వెంటాడుతున్నాయి. అదే సర్వేలు చేయించుకోవడం. ఈ క్రమంలోనే గడిచిన ఐదు మాసాలుగా తాము అనుసరిస్తున్న విధానంపై స్వతంత్రంగా ఆయన నివేదిక తయారు చేయించుకున్నారు.
వర్క్ అవుట్ అవ్వడం లేదని….
చంద్రబాబు ఆదేశాలతో పార్టీ నాయకులు తాజాగా నివేదికలు ఇచ్చారు. ఈ నివేదికల్లో.. ప్రజలు బాబు ప్రచార ఆర్భాటాలను, జగన్‌ను దూషించడాన్ని అస్సలు సహించలేక పోతున్నారని తేలింది. అంతేకాదు, ఎంచుకున్న సబ్జెక్టులు కూడా సరిగా లేవనే అభిప్రాయం కూడా వెల్లడైందట. దీంతో ఇప్పుడు బాబు నిర్వేదంలో మునిగారని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విశాఖ లాంగ్ మార్చ్ వేదికగా పవన్‌తో జతకలిశారనే ప్రచారం కూడా ఉంది. సో.. ఇదీ చంద్రబాబుబు ఉద్యమాట పర్యవసానం.
