బాబుకు అన్నీ మంచి లక్షణాలే… ఆ ఒక్కటి మాత్రం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విజన్ ఉంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేశారు. కొత్త రాష్ట్రాన్ని ఎలా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విజన్ ఉంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేశారు. కొత్త రాష్ట్రాన్ని ఎలా [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు విజన్ ఉంది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేశారు. కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు కాని, పార్టీ అధినేతగా మాత్రం ఫెయిలవుతున్నారు. రాజకీయ నిర్ణయాల్లో చంద్రబాబు వేసిన తప్పటడుగులే ఆయనను అధికారం నుంచి దూరం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
క్రెడిబులిటీ లేక…..
చంద్రబాబు కు అన్నీ మంచి లక్షణాలే. కానీ ఒకే ఒక బ్యాడ్… క్రెడిబులిటీ లేకపోవడం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పద్ధెనిమిది గంటలు రాష్ట్రంకోసం పనిచేస్తారు. అధికారులను ఊపిరి తీసుకోనివ్వరు. ఇక వరదలు, విపత్తుల సమయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలు ఆయన పనితీరుకు అద్దం పడతాయి. 2014 ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబుకు క్రెడిబులిటీ ఉండేది. అదే ఆయనను ఎన్నికల్లో కాపాడింది. చంద్రబాబుకు మంచి స్ట్రాటజిస్ట్ గా కూడా పేరుంది. కానీ ఎక్కువ సార్లు వ్యూహాలు ఫెయిల్ అయిన నేతగా ముద్రపడిపోయింది.
రాజకీయ నిర్ణయాలు….
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సత్వరం అభివృద్ధి చెందుతుందని ఏపీ ప్రజలు భావించి పట్టంకట్టారు. అమరావతి కాన్సెప్ట్ కూడా మంచిదే. ఉచితంగా రైతులు ఇచ్చే భూముతో రాజధానిని నిర్మించి ఏపీకి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలనుకున్నారు. ఇందులో ఎవరూ తప్పపట్టాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే రాజధానిని పూర్తి చేయకూడదన్న ఆయన ఆలోచనే ఆయనపై ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో కోల్పోయేలా చేసింది. మరోవైపు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఆయనను చపలచిత్తుడిగా ప్రజల ముందు నిలబెట్టాయి.
మార్పు రాలేదే….
ిఇంత జరిగినా చంద్రబాబులో మార్పు రాలేదు. మరోసారి బీజేపీ వైపు చేరడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలంటే బీజేపీతో కలవడం కాదు. ఇప్పటికే బీజేపీతో కలసి, విడిపోయి ఆయన పెట్టుకున్న పొత్తులు అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. సొంతంగా తాను. తన పార్టీపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తేనే వచ్చే ఎన్నికల్లోనైనా విజయం దక్కుతుంది. ఇలాగే బీజేపీ వెనక పడితే మాత్రం చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే అవకాశమే లేదు. మరి తాత్కాలికంగా ఇబ్బందుల నుంచి బయటపడటానికి, జగన్ ను ఇబ్బంది పెట్టడానికి బీజేపీతో చేతులు కలిపితే చంద్రబాబుకు మరోసారి పరాభావం తప్పదన్నది విశ్లేషకుల అంచనా.

