మొత్తానికి ఇక్కడ పడుకోబెట్టేశారుగా?
ఏడాది అయిన తర్వాత పోస్ట్ మార్టం మొదలు పెట్టారు తెలుగుతమ్ముళ్లు. తమ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని తీరిగ్గా ఏడాది అయిన తర్వాత విశ్లేషణ చేసుకుంటున్నారు. [more]
ఏడాది అయిన తర్వాత పోస్ట్ మార్టం మొదలు పెట్టారు తెలుగుతమ్ముళ్లు. తమ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని తీరిగ్గా ఏడాది అయిన తర్వాత విశ్లేషణ చేసుకుంటున్నారు. [more]

ఏడాది అయిన తర్వాత పోస్ట్ మార్టం మొదలు పెట్టారు తెలుగుతమ్ముళ్లు. తమ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని తీరిగ్గా ఏడాది అయిన తర్వాత విశ్లేషణ చేసుకుంటున్నారు. దీంతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ పార్టీని పూర్తిగా పడుకోబెట్టేశారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇప్పుడు జిల్లాలో పార్టీని పట్టించుకునే వారే కరవయ్యారు. పేరుకు హేమాహేమీ నేతలున్నప్పటికీ పార్టీకి ఏడాది నుంచి ఏమాత్రం ప్రయోజనం లేదు.
బాబు పట్టించుకోకనే…..
కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో 14 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 2014 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో పెద్దగా పొడిచింది లేదు. అప్పటి ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలిచింది. 2014 లో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడమే తప్ప పార్టీని బలోపేతం చేయడంపై అప్పుడూ చంద్రబాబు దృష్టి పెట్టలేదు.
ఓటమి తర్వాత కూడా…..
దాని ఫలితమే మొన్నటి ఎన్నికలు కర్నూలు జిల్లాలో టీడీపీికి ఫలితాలు శూన్యగంటను మోగించాయి. ఇక ఓటమి తర్వాతనైనా చంద్రబాబు ఇక్కడ పట్టించుకుంటారంటే అదీ లేదు. దీంతో నేతలు బయటకు రావడమే మానేశారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో దిగువ స్థాయి క్యాడర్ అధికార పార్టీ వైపునకు వెళుతుంది. అయినా నియోజకవర్గ స్థాయి నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదు. దీనికి స్థానిక సంస్థల ఎన్నికలే ఉదాహరణగా చెబుతున్నారు.
నేతలందరూ ఎవరికి వాళ్లే….
ఇక్కడ దాదాపు చాలా చోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీనికి పరోక్షంగా టీడీపీ నేతలు సహకరించారంటున్నారు. అనేక నియోజకవర్గాల నుంచి తమకు ఎన్నికల్లో సహకరించని వారిపై ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే వాళ్లు కూడా బలమైన నేతలే కావడంతో చంద్రబాబు దీనిపై పంచాయతీ పెట్టలేదు. దీంతో కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా టీడీపీ సందడే లేదు. అనేక మంది నేతలు ఏడాది నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పట్టించుకోకుంటే కర్నూలు జిల్లాలో టీడీపీ కోలుకోవడం కష్టమే.

