థిక్కారం దిగేట్లు లేదే
తెలుగుదేశం పార్టీ అధినేత జిల్లా టూర్లు పెద్దగా వర్క్ అవుట్ అయ్యేటట్లు కన్పించడం లేదు. నేతలు థిక్కార స్వరం విన్పిస్తున్నారు. అధినేత వచ్చినా అందుబాటులో లేకుండా పోయారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత జిల్లా టూర్లు పెద్దగా వర్క్ అవుట్ అయ్యేటట్లు కన్పించడం లేదు. నేతలు థిక్కార స్వరం విన్పిస్తున్నారు. అధినేత వచ్చినా అందుబాటులో లేకుండా పోయారు. [more]

తెలుగుదేశం పార్టీ అధినేత జిల్లా టూర్లు పెద్దగా వర్క్ అవుట్ అయ్యేటట్లు కన్పించడం లేదు. నేతలు థిక్కార స్వరం విన్పిస్తున్నారు. అధినేత వచ్చినా అందుబాటులో లేకుండా పోయారు. ఇది థిక్కార స్వరమే నని చెప్పక తప్పదు. క్యాడర్ లోనూ, లీడర్లలోనూ భరోసా నింపేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అయినా చంద్రబాబు నేతలకు ధైర్యం నూరి పోస్తున్నారు. నేతలు వెళ్లిపోయినా పరవాలేదని, క్యాడర్ నుకాపాడుకోవాలని ఆయన సూచిస్తున్నారు. తూర్పు గోదావరిజిల్లాలో చంద్రబాబు సమీక్షల్లో ఓటమికి గల కారణాలపై పెద్దగా చర్చించకపోవడమూ విశేషమే.
రెండు రోజుల పర్యటనలో…..
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటించారు. కాకినాడలోనే మకాం వేసి మరీ నేతలను కలుసుకున్నారు. అయితే ప్రత్తిపాడు, రామచంద్రాపురం నియోజకవర్గాలతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా చంద్రబాబు సమీక్ష సమావేశాలకు దూరంగా ఉన్నారు. అధినేత జిల్లాలో ఉన్నా అక్కడకి వచ్చి పలకరించిన పాపాన పోలేదు. రామచంద్రాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమావేశానికి హాజరుకాలేదు. ఆయన పార్టీని త్వరలోనే వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పత్తిపాడు నియోజకవర్గం ఇన్ ఛార్జి వరుపుల రాజా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడి లోకల్ నేతలతోనే చంద్రబాబు సమీక్షను నిర్వహించాల్సి వచ్చింది.
కొత్త ఇన్ ఛార్జులను….
ఈ రెండు నియోజకవర్గాలకు కొత్త ఇన్ ఛార్జులను నియమించాలని చంద్రబాబు సీనియర్ నేతలకు సూచించారు. జ్యోతుల నెహ్రూ, నిమ్మకాలయ చినరాజప్పకు అప్పగించాలని తొలుత భావించినా ఇన్ ఛార్జుల నియామకం కోసం ఐదుగురితో కూడిన ఒక కమిటీని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. తొందరపడకుండా అన్నీ ఆలోచించి బలమైన నేతను ఇన్ ఛార్జిగా ఆ రెండు నియోజకవర్గాలకు నియమించాలని చంద్రబాబు సూచించారు. ఇకపై కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపునిస్తే ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. గతంలో టీడీపీ పిలుపునిచ్చిన అన్నాక్యాంటిన్లు, ఇసుక కొరతకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు కొన్ని నియోజకవర్గాల్లో జరగకపోవడంపై అసంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
థిక్కార స్వరంతోనేనా….
తోట త్రిమూర్తులతో పాటు చంద్రబాబు సమావేశానికి పార్టీ సీనియర్ నేత బొడ్డు భాస్కరరామారావు కూడా హాజరు కాలేదు. ఈయనకూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈయనతో పాటు కాకినాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దొరబాబు సయితం సమావేశానికి డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. ఈయనకు, మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు మధ్య విభేదాలున్నాయి. ఇటీవల ఎన్నికల్లో కొండబాబుకు టిక్కెట్ ఇవ్వవద్దనిదొరబాబు పట్టుబట్టారు. పది మంది కార్పొరేటర్లు సయితం చంద్రబాబు సమావేశానికి హాజరుకాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో చంద్రబాబు నిమ్మకాయల చిన రాజప్పపై ఒకింత ఆగ్రహంవ్యక్తం చేసినట్లు సమాచారం. అందరినీ సమావేశానికి ముందే సమన్వయం చేసుకోకపోతే ఎలా అని రాజప్పను చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

