ఆయనకు అది…ఈయనకు ఇది… చికాకేనా ?
చికాకు. ఈ మాట ప్రజలలోకి వచ్చి రాజకీయం చేద్దామనుకున్న వారికి అసలు ఉండరాని మాట. ఇక తర తమ భేదం అంతకంటే ఉండరాదు. నాయకుడు అన్న తరువాత [more]
చికాకు. ఈ మాట ప్రజలలోకి వచ్చి రాజకీయం చేద్దామనుకున్న వారికి అసలు ఉండరాని మాట. ఇక తర తమ భేదం అంతకంటే ఉండరాదు. నాయకుడు అన్న తరువాత [more]

చికాకు. ఈ మాట ప్రజలలోకి వచ్చి రాజకీయం చేద్దామనుకున్న వారికి అసలు ఉండరాని మాట. ఇక తర తమ భేదం అంతకంటే ఉండరాదు. నాయకుడు అన్న తరువాత అందరి వాడు కావాలి. కానీ హ్రస్వ ద్రుష్టి కలిగిన మన నాయకులు చాలా పరిధులు పెట్టుకున్నారు. తామున్న చోటనే గిరి గీసుకుని మరీ స్వార్ధ రాజకీయం చేస్తున్నారు. అలాంటపుడు నాయకుడి మీద ఏకమొత్తంగా జనాలకు విశ్వాసం కలుగుతుందా. తమవాడు అని అనుకునేందుకు వీలు అవుతుందా?
జగన్ కి చికాకా?
అమరావతి లోనే ఉంటూ ముఖ్యమంత్రిగా జగన్ దాదాపుగా ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతున్నారు. జగన్ కి అమరావతి రాజధాని గిట్టదని టీడీపీ నేతలు చెబుతారు. రాజధాని శంఖుస్థాపనకు ఆయన రాలేదని అదే పెద్ద ఉదాహరణ అని కూడా అంటారు. ఇక రాజధానిని మూడు ముక్కలు చేయాలని జగన్ అనుకోవడం వెనక కూడా ఆయనకు అమరావతి అంటే ఉన్న చికాకే కారణమని కూడా పసుపు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఎంతవరకూ నిజమన్నది పక్కన పెడితే జగన్ చేస్తున్న చర్యలు, దూకుడు విధానం కూడా ఆ విధంగానే ఉన్నట్లుగా జనం కూడా అనుమానించాల్సివస్తోంది.
విశాఖ అంటే…..?
ఇక చంద్రబాబుకు విశాఖ అంటే మహా ద్వేషమని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో కరోనా కేసులు ఎక్కువ లేవని చంద్రబాబు పడి ఏడుస్తున్నారని ఏకంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు అంటున్నారంటేనే విశాఖ వర్సెస్ చంద్రబాబు గా రాజకీయ కధ నడిపిస్తున్నార్ని అర్ధమవుతోంది. మూడు రాజధానుల ముచ్చట వచ్చినపుడు కూడా చంద్రబాబు అమరావతికే ఓటేశారు. ఇక ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒక ఫ్లై ఓవర్ అయినా మంజూరు చేయలేదని కూడా చెబుతారు. ఇపుడు రాజధానికి కూడా అడ్డుపడుతున్నారంటే కూడా అది చంద్రబాబుకు ఈ నగరం పట్ల ద్వేషమని వైసీపీ ప్రచారం చేస్తోంది. కరోనా కేసులు విశాఖలో ఎక్కువ కాకుండా దాచేస్తున్నారని వస్తున్నా విమర్శల పైన రివర్స్ లో వైసీపీ అటాక్ చేస్తోంది. టీడీపీకి అసలు విశాఖ అంటేనే ఇష్టం లేకుండా పోయిందని, అందుకే కరోనా ఇక్కడ లేదని పెడబొబ్బలు పెడుతున్నారని అంటున్నారు.
ప్రమాదకరమే?
రాజకీయ పార్టీల నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాల పరిధి నుంచి బయటకు రావాలి. ఒక వేళ తమపైన అలాంటి ఇంప్రెషన్ పడుతోందని తెలిసినప్పుడైనా కరెక్ట్ గా వ్యవహరించాలి. కానీ అటు జగన్, ఇటు చంద్రబాబు కూడా పంతాలకు పోతూ తమ నాయకత్వాలకే పరీక్షలు తెచ్చిపెట్టుకుంటున్నారు. పదమూడు జిల్లాల ఏపీకి ముఖ్యమంత్రులుగా చేసిన వారు అందరివారుగా ఉండాలి కానీ ఇలా తమకు తాముగా జనానికి దొరికిపోతూంటే యావత్తు ఆంధ్ర సమాజాన్ని కట్టడిలో ఎలా పెట్టగలరు. ఇది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. .

