బాబు సైడ్ ట్రాక్ పట్టిస్తుంటే..జగన్ చోద్యం చూస్తున్నారుగా?
చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి జగన్ ఇమేజ్ పెరగకుండా చూసుకుంటున్నారు. చంద్రబాబు ట్రాప్ లో వైసీపీ పడిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు [more]
చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి జగన్ ఇమేజ్ పెరగకుండా చూసుకుంటున్నారు. చంద్రబాబు ట్రాప్ లో వైసీపీ పడిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు [more]

చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి జగన్ ఇమేజ్ పెరగకుండా చూసుకుంటున్నారు. చంద్రబాబు ట్రాప్ లో వైసీపీ పడిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఉపయోగం లేకుండా చేస్తున్నారు చంద్రబాబు. వైసీపీ కూడా టీడీపీ వెనకే పడుతూ తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతుందనే చెప్పాలి. చంద్రబాబు ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీని అమలు చేస్తూ వైసీపీ సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు.
సంక్షేమ పథకాలను అమలు…
నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. మేనిపేస్టోలో ఉన్న హామీల అమలుకే ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదు. ఇప్పటికే దాదాపు మూడున్నర కోట్ల మంది లబ్దిదారులకు అరవై వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేశారు. రెండో విడత సాయం చేయడానికి కూడా జగన్ రెడీ అవుతున్నారు.
అవి తప్ప అనేక విషయాలు…..
అయితే సంక్షేమ పథకాల విషయం ప్రజల్లో పెద్దగా చర్చ జరగడం లేదు. నిత్యం తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు వంటి వాటిపైనే ఎక్కువగా మీడియా ఫోకస్ చేస్తుంది. ఇక వైసీపీ కూడా టీడీపీ విమర్శలకు సమాధానం చెబుతూ కాలక్షేపం చేస్తుంది. గత కొద్ది నెలలుగా వరసగా అంతర్వేది రధం దగ్దం, తిరుమలలో జగన్ డిక్లరేషన్, అమరావతి రాజధాని తరలింపు వంటి అంశాలపై ఏపీలో ఎక్కువగా ఫోకస్ అయింది.
నిత్యం ఏదో ఒక అంశంతో…..
ఇది పక్కాగా తెలుగుదేశం వేసుకున్న స్కెచ్ ప్రకారమే జరుగుతుందంటున్నారు. మీడియా కూడా సంక్షేమ పథకాలకంటే ప్రభుత్వం పై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నా ప్రజల్లోకి పెద్దగా పోవడం లేదు. కేవలం లబ్దిదారులకే జగన్ ను చంద్రబాబు పరిమితం చేయగలిగారు. వైసీపీ నేతలు కూడా సంక్షేమ పథకాల ప్రచారంపై దృష్టిపెట్టకుండా టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకే సమయం వెచ్చిస్తున్నారు. ఆర్థిక స్థోమతకు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ ఫెయిలయిందనే చెప్పాలి. జగన్ పథకాలు మాత్రం ప్రచారానికి నోచుకోవడంలేదు. సైడ్ ట్రాక్ పట్టించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

