బంకరు చరిత్ర ఇప్పటిది కాదా?
ప్రాణమంటే ప్రతి ఒక్కరికీ తీపి. ఈ విషయంలో సామాన్యుడి నుంచి శక్తి వంతమైన దేశాధినేతల వరకుా అందరిదీ ఒకేధోరణి. అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనుా తమ ప్రాణాలను కాపాడుకోవాలని [more]
ప్రాణమంటే ప్రతి ఒక్కరికీ తీపి. ఈ విషయంలో సామాన్యుడి నుంచి శక్తి వంతమైన దేశాధినేతల వరకుా అందరిదీ ఒకేధోరణి. అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనుా తమ ప్రాణాలను కాపాడుకోవాలని [more]

ప్రాణమంటే ప్రతి ఒక్కరికీ తీపి. ఈ విషయంలో సామాన్యుడి నుంచి శక్తి వంతమైన దేశాధినేతల వరకుా అందరిదీ ఒకేధోరణి. అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లోనుా తమ ప్రాణాలను కాపాడుకోవాలని అందరుాభావిస్తారు. ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ కొందరు మాత్రం సురక్షితంగా ఉండగలరు. అటువంటి వారిలో అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందువరుసలో ఉంటారు. ప్రత్యేక పరిస్ధితుల్లో దేశాధినేతల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి దేశంలోనూ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్ధలు ఉంటాయి. వారిని కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. విదేశీదాడులు, అంతర్గత కల్లోలాల నుంచి అధినేతలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు ఉంటాయి. వీటిల్లో “బంకర్ల” వ్యవస్ధ ఒకటి. సాధారణంగా దేశసరిహద్దుల్లో విదేశీ దాడులను నుంచి సైనికులను కాపాడుకునేందుకు వీటిని నిర్మిస్తాయి. కానీ కొన్ని దేశాల్లో అధినేతలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కూడా “బంకర్లు” నిర్మించారు. ఈ విషయంలో విమర్శకుల ప్రపంచ పోలీస్ గా పిలుచుకునే అమెరికా ముందుంది.
అత్యవసర పరిస్థితుల్లో…..
నల్ల జాతీయుల నిరసనలతో హోరెత్తుతున్న అమెరికాలో పరిస్ధితులు చేయిదాటే ప్రమాదం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 150 కి పైగా నగరాల్లో ఈ పరిస్ధితి నెలకొంది. స్వయంగా అధ్యక్షుడు కొలువుదీరే రాజధాని నగరంలోని “శ్వేతసౌధం” వద్ద కుాడా పరిస్ధితులు శృతిమించాయి. దీంతో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఏర్పడగలదన్న అనుమానంతో భద్రతాధికారులు ఆయనను అధ్యక్ష భవనం కిందగల “బంకరు” లోకి తరలించారు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇలాంటి బంకర్లు నాలుగైదు ఉన్నట్లు అంచనా. శ్వేతసౌధం తుార్పు వైపున ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఉంది. దీనిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అంటే 1940 లో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ హయాంలో నిర్మించారు. నాటి యుద్ధ పరిస్ధితుల్లో అధ్యక్షుడి రక్షణ కోసం దీనిని నిర్మించినట్లు చెబుతారు. అమెరికాలోని పెరలో హార్వర్ పై దాడి జరగడంతో దీనిని నిర్మించారు. 1948 లో నాటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ హయాంలో దీనిని నవీకరించారు. అప్పటి పరిస్ధితులకు అనుగుణంగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఆధునికరించారు. అధ్యక్షుడు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. శత్రుదుర్బేధ్యంగా తీర్చిదిద్దారు.
రెండు వేల సంవత్సరంలో…..
2000 సెప్టెంబరు లో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రదాడి సందర్భంగా శాంతిభద్రతల పరిస్ధితులు వేడెక్కాయి. దీంతో నాటి అధ్యక్షుడు జార్జిబుష్ ను అధికారులు ఈ బంకరుకు తరలించారు. బుష్ భార్య, దేశప్రధమ మహిళ లారా బుష్, విదేశాంగమంత్రి కంగోలిజారైస్, ఉపాధ్యక్షుడు రిచర్డ్ బి.చెనీ తదితరులను తరలించారు. 2010 లో ప్రచురితమైన ఓ గ్రంధంలో లారాబుష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అందులో సకల సౌకర్యాలు ఉన్నట్లు లారాబుష్ వివరించారు. 2010 లో అమెరికా అధికారులు మరో బంకరును నిర్మించారు. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు దీనికి శ్రీకారం చుట్టారు. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం జారిగింది. ఇది అయిదు అంతస్తుల కట్టడం. ఇందులో గాలి సరఫరాకు ఏర్పాటు చేశారు. అణ్వస్త్రదాడి జరిగినా అందులో ఉండే అధ్యక్షుడు, ఇతర అధికారులు ఎలాంటి ముప్ప వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అణుదాడి జరిగినా రేడియెాధార్మిక శక్తి బంకరులోకి వెళ్ళకుండా దట్టమైన కాంక్రీటు గోడలు నిర్మించారు. 2017 లో అధికారం చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ దీనిని సందర్శించారు. తాజాగా తాను బంకరులో తలదాచుకున్నట్లు వచ్చిన వార్తలను ట్రంప్ ఖండించారు. తాను అక్కడ ఉండలేదని, అక్కడి పరిస్ధితులను పరిశీలించేందుకు మాత్రమే వెళ్ళానని ఆయన స్పష్టపరిచారు.
ఎంతో మంది నేతలు…..
అయితే ఆయన వాదనను అంతర్జాతీయ సమాజం విశ్వసించడం లేదు. దేశాధినేతలు బంకర్ల లో తలదాచుకోవడం కొత్తేంకాదు. ఇది ఒక్క అమెరికన్ అధ్యక్షుడు మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఇతర దేశాధినేతలు కుాడా వివిధ సందర్భాల్లో వీటిల్లో తల దాచుకున్నారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ కొన్ని నెలలపాటు సుదీర్ఘకాలంలో బంకరు లో గడిపారు. ఇరాక్-ఇరాన్ యుద్ధసమయంలోనుా, అమెరికా బలగాలు తనపై దాడి సందర్భంగా ఆయన బంకరులో తలదాచుకున్నారు. సిరియా ప్రస్తుత అధ్యక్షుడు బషర్ అల్ అసల్ కుాడా దేశంలో అంతర్యుద్ధం సమయంలో బంకరులో గడిపారు. హిల్లర్, కల్నల్ గడాఫీ వంటి నియంతలు కుాడా వీటిల్లో కాలక్షేపం చేశారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేని నాయకులు తమ దగ్గరకు వచ్చే సరికల్లా బంకర్లు లాంటి సురక్షితస్ధావరాలను ఎంచుకోవడం అసలైన వైచిత్రి!
-ఎడిటోరియల్ డెస్క్

