జగన్ మీదకు అన్నయ్యా.. తమ్ముడా ?
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఎన్నడూ లేనంత బలంగా ఆయన ప్రభుత్వాధినేతగా కొలువుతీరారు. ఓ వైపు చూస్తే వయసుడిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో [more]
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఎన్నడూ లేనంత బలంగా ఆయన ప్రభుత్వాధినేతగా కొలువుతీరారు. ఓ వైపు చూస్తే వయసుడిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో [more]

ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఎన్నడూ లేనంత బలంగా ఆయన ప్రభుత్వాధినేతగా కొలువుతీరారు. ఓ వైపు చూస్తే వయసుడిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో వైపు చుక్కాని లేని నావలా జనసేన ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఎపుడూ లేని విధంగా 50 శాతం పైగా ఓట్ల షేర్ తో 86 శాతం సీట్లతో జగన ధీమాతో ఉన్నారు. మరి జగన్ని సీఎం కుర్చీ నుంచి తప్పించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పాతుకుపోవాలని కన్నేసిన కమలానికి మాత్రం ఆశ చావడంలేదు. అందుకే కొత్త ప్రయోగాలకు రెడీ అవుతోంది.
జగన్ని ఢీ కొట్టేదెవరో..
అధ్బుతమైన విజయంతో జగన్ మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా ఏపీలో వెలిగిపోతున్నారు. దానికి తోడు ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన సత్తా చాటుకుంటున్నారు. అనుభవం కంటే మనసు ముఖ్యమని చెబుతూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు. దీంతో జగన్ ఇమేజ్ ముఖ్యమంత్రిగా మరింతగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో జగన్ని ఢీ కొట్టాలంటే బాగా ఇమేజ్ ఉన్న వారే ఉండాలి. జనంలో పలుకుబడి ఉన్నవారు, పాపులరిటీ కలిగిన వారు ఉండాలి. బీజేపీ ఇపుడు అదే విషయాన్ని ఆలోచిస్తోందట. ఎంతమంది పార్టీలో చేరినా ఇమేజ్ ఉన్న నాయకుడు ఏపీలో పార్టీని లీడ్ చేయకపోతే వైసీపీని తట్టుకోవడం కష్టమని భావిస్తోందట. దాంతో మెగా ఫ్యామిలీ వైపు బీజేపీ చూపు మళ్ళిందని అంటున్నారు.
అయితే అన్నయ్య…లేకుంటే తమ్మయ్య :
ఇక మెగా కుటుంబం మీదనె ఇపుడు బీజేపీ కోటి ఆశలను పెట్టుకుంది. చిరంజీవిని రంగంలోకి దింపి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటోందట. అదే విధంగా ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేస్తోందట. ఏపీలో పార్టీకి నాయకత్వం వహించినట్లైతే అండదండలు తాము పూర్తిగా అందిస్తామని చెబుతోందట. చిరంజీవి ఈ ప్రతిపాదలనకు ఒప్పుకుంటే ఏపీలో పార్టీ విస్తరణ నల్లేరు మీద నడకేనని అంటున్నారు. చిరంజీవి కాదు కూడదు అంటే మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ ని దువ్వాలని కూడా డిసైడ్ అయిపోయారట. గతంలోనే జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్ షా చెప్పారని ఏకంగా పవనే చెప్పుకున్నారు. ఇపుడు ఎటూ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ కూడా వేరే ఆలోచన చేస్తారు కాబట్టి తమ ప్రతిపాదనకు కాదనే పరిస్థితి ఉండదని బీజేపీ అనుకుంటోందట. మరి అన్నయ్య, తమ్ముడు ఈ ఇద్దరి మీదనే కమలం పార్టీ కన్నేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఇద్దరూ జగన్ని ఢీ కొట్టగలరని కూడా గట్టిగా నమ్ముతోంది.

