కమలం కబడ్డీ ఆడేస్తుందా?
బీజేపీ తేడా గల పార్టీ. ఇది వాజ్ పేయ్, అద్వాని కాలంలో వినిపించిన మాట. ఇపుడు మోడీ, అమిత్ షా సారధ్యంలో ఉన్న పార్టీ కూడా తేడా [more]
బీజేపీ తేడా గల పార్టీ. ఇది వాజ్ పేయ్, అద్వాని కాలంలో వినిపించిన మాట. ఇపుడు మోడీ, అమిత్ షా సారధ్యంలో ఉన్న పార్టీ కూడా తేడా [more]

బీజేపీ తేడా గల పార్టీ. ఇది వాజ్ పేయ్, అద్వాని కాలంలో వినిపించిన మాట. ఇపుడు మోడీ, అమిత్ షా సారధ్యంలో ఉన్న పార్టీ కూడా తేడా గలదే మరి మరో వైపు చూసుకుంటే దేశంలో వేరే నాయకత్వం కూడా పోటీగా లేకపోవడంతో బీజేపీ ఏకపక్ష రాజకీయాలే హవా చాటుకుంటున్నాయి. బీజేపీకి ఇంతకంటే మంచి కాలం లేదనిపిస్తోంది కూడా. దాంతోనే మహారాష్ట్రలో దశాబ్దాల నేస్తం, ఒకే భావజాలం కలిగిన శివసేనకు గట్టి ఝలక్ ఇచ్చి మరీ అధికార పీఠాన్ని పట్టేసింది బీజేపీ. సరే ఇవన్నీ ఇలా ఉంటే మహా రాజకీయం దేశానికి ఇస్తున్న సరికొత్త సందేశంతో ప్రాంతీయ పార్టీల నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. అటు కేసీఆర్, ఇటు జగన్ శిబిరాలు తాజా రాజకీయ పరిణామాలతో ఉలిక్కిపడినట్లుగానే టాక్ నడుస్తోంది.
తట్టుకోగలరా…?
బీజేపీ కన్ను తెలుగు రాజకీయాల మీదనే ఉంది అంటున్నారు. తమిళనాడు అరవ రాజకీయం అంత సులువుగా కొరుకుడుపడే వ్యవహారం కాదు, కేరళలో అయితే బోణీ లేదు, కర్ణాటక ఎటూ చేతిలో ఉంది. దాంతో అటు కేసీఆర్, ఇటు జగన్ ఈ ఇద్దరిని టార్గెట్ చేస్తూ కమలం కబడ్డీ ఆడుకునేందుకు రెడీ అవుతోందని అంటున్నారు. ఎక్కడ దొరుకుతారా అన్నదే ఆలస్యం కానీ ఒక్కసారి చిక్కారా వదిలేది లేదు అన్నట్లుగా కాషాయ దళం కసి మీద ఉందని అంటున్నారు. కేసీయార్ మీద అప్పట్లో కేంద్ర మంత్రిగా చేసినపుడు బొగ్గు స్కాం వ్యవహరంపై ఆరోపణలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఇప్పటికీ గుర్తు చేస్తూంటాయి. మరో వైపు ఆరేళ్ళూగా తెలంగాణా సీఎంగా కేసీఆర్ ప్రతీ కదలికపైనా కేంద్రం నిఘా ఉంచుతోంది. ఇక పాలనాపరంగా ఏ విధమైన తప్పులు జరిగినా కూడా రంగంలోకి దిగాలనుకుంటోంది.
జగనూ…బెయిలూ….
ఏపీ సీఎం జగన్ విషయంలో విపక్షాలు అన్ని ఒక్క పాట పాడుతున్నాయి ఆయన మళ్ళీ జైలుకు వెళ్తాడని అంటున్నారు. మరో వైపు బెయిల్ రద్దు అవుతుందని, ఏపీలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని కూడా గాసిప్పులే గాసిప్పులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగానే ఏ మాత్రం మెజారిటీ లేకపోయినా మహారాష్ట్రలో పాగా వేయడానికి బీజేపీ చూపించిన దూకుడు మరో మారు తెలుగు రాజకీయాల్లో వేడి వాడి చర్చగా ఉంది. ఇంకా నాలుగున్నరేళ్ళ పాటు మోడీ, అమిత్ షాల అధికారం ఉంది. పైగా ఒక వ్యూహం ప్రకారం బీజేపీని బలోపేతం చేయలని వారు భావిస్తున్నారు.
దోస్తుల పట్లే కాఠిన్యం……
ఈ క్రమంలో దశాబ్దాలా దోస్తులకే కటీఫ్ ఇచ్చేసే కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. మరి ఏపీ, తెలంగాణా రాజకీయాల్లో బీజేపీకి మిత్రులు లెవరూ లేరు కూడా. ఈ నేపధ్యంలో జరుగుతున్న టీవీ డిబేట్లతో సైతం ఏదో జరగవచ్చు నుంచి ఏమైనా జరగవచ్చు అన్న ముగింపునకు అంతా వస్తున్నారు. ఏపీలో జగన్ జోలికి ఎవరూ రాలేరని ఓ చానల్ డిబేట్ లో వైసీపీ నేత చేసిన కామెంట్స్ కూడా ఆ పార్టీలో అంతర్గత చర్చలు ఇదే విషయంపై జరుగుతున్నాయని వెల్లడి చేస్తున్నాయి. ఏది ఏమైనా మహా రాజకీయంతో ఒక్క దెబ్బకు పదిమందికీ బీజేపీ సమాధానం చెప్పినట్లైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

