జంపింగ్ లు అందుకేనా?
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ నుంచి వలసలు ఎక్కువవుతన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సహా తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో [more]
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ నుంచి వలసలు ఎక్కువవుతన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సహా తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో [more]

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ నుంచి వలసలు ఎక్కువవుతన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సహా తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిపోతున్నారు. చివరకు కమ్యునిస్టు పార్టీల ఎమ్మెల్యేలు కూడా కాషాయకండువా కప్పుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు ఈ ఫిరాయింపులు ఏ మేరకు లాభిస్తాయన్నది అనుమానమే అయినా వారికి ఇటీవల జరిగిన ఎన్నికలు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఉప ఎన్నికల్లో విజయం….
టీఎంసీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులకు తిరిగి టిక్కెట్లు కేటాయిస్తామని బీజేపీ హామీ ఇస్తుంది. గతంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప అందరూ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లోనూ జంప్ చేసిన ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున విజయం సాధించారు. దీనిని బీజేపీ హైలెట్ చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇవి సాధారణ ఎన్నికలే….?
అయితే కర్ణాటక, మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జంప్ చేసిన ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికవుతున్నారు. సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పార్టీకి అడ్వాంటేజీగా ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాల్లో అదే జరిగింది. కానీ పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్నవి ఉప ఎన్నికలు కావు. ఇక్కడ సాధారణ ఎన్నికలు కావడంతో జంప్ జిలానీలకు రాజకీయంగా అడ్వాంటేజీ ఉండదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అలివికాని హామీలిచ్చినా…..
తృణమూల్ కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకు బీజేపీ జంపింగ్ ల ఎత్తుగడ వేసింది. దాదాపు 9 మంది ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పేసింది. వీరందరికీ స్పష్టమైన హామీ బీజేపీ అధినాయకత్వం నుంచి లభించినట్లు తెలిసింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సాధారణ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టమైంది. దీంతో పార్టీ మారిని జంప్ చేసిన ఎమ్మెల్యేలకు మాత్రం గెలుపు ఫీవర్ మాత్రం వదిలిపెట్టడం లేదట. మమత బెనర్జీ మాత్రం బీజేపీ లో చేరిన తమ నేతలపై గట్టి పోటీ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

