పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందటగా
శాసనమండలి, మూడు రాజధానుల అంశం ఇప్పడు కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇప్పటి వరకూ కేంద్రం పెద్దలు స్పందించలేదు. రాజధానుల అంశం రాష్ట్రాల [more]
శాసనమండలి, మూడు రాజధానుల అంశం ఇప్పడు కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇప్పటి వరకూ కేంద్రం పెద్దలు స్పందించలేదు. రాజధానుల అంశం రాష్ట్రాల [more]

శాసనమండలి, మూడు రాజధానుల అంశం ఇప్పడు కేంద్ర ప్రభుత్వం చేతులో ఉన్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఇప్పటి వరకూ కేంద్రం పెద్దలు స్పందించలేదు. రాజధానుల అంశం రాష్ట్రాల వ్యవహారమని, అందులో జోక్యం చేసుకునేది లేదని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇక శాసనమండలి రద్దు విషయంలో ఎటువంటి స్పష్టత లేదు. శాసనమండలిపైన ఏపీ అసెంబ్లీ కేంద్రానికి పంపిన తీర్మానం పై అనుకూల నిర్ణయం తీసుకుంటే బీజేపీకి వైసీపీ బి టీంగా భావించక తప్పదు.
బీజేపీ రాష్ట్ర శాఖ తప్ప…..
నిజానికి మూడు రాజధానుల అంశంపై బీజేపీ రాష్ట్ర శాఖ మాత్రమే అభ్యంతరం తెలుపుతుంది. అది కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదు. అరకొరగా రాజధాని రైతులకు మద్దతిచ్చి మమ అనిపించేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలసినా ఆయన వాయిస్ కూడా పెద్దగా రాజధాని అంశంపై విన్పించడంలేదు. రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడలో లాంగ్ మార్చ్ చేయాలని ప్రకటించి కూడా వెనక్కు తగ్గడం అనుమానాలకు తావిస్తున్నాయి.
కేంద్రం పెద్దల సూచనలతో….
దీని వెనక కేంద్రం పెద్దల సూచనలు ఉన్నాయంటున్నారు. అమరావతి రాజధాని అంశం ఇప్పుడు పార్లమెంటుకు చేరింది. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అమరావతి రాజధాని అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి కేంద్రం దృష్టిలో పెట్టారు. దీనిపై కేంద్రం విచారణను కూడా ఆయన కోరారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి. మరోవైపు రాజధాని అమరావతి లో జరిగిన భూ కుంభకోణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది.
అందుకే వేగంగా….
మొత్తానికి చూసుకుంటే మూడు రాజధాలను అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నది దాదాపుగా తెలిసిపోయింది. అందుకే జగన్ ప్రభుత్వం వేగంగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. అయితే తమను ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీని ఇరుకుపెట్టాలన్నదే బీజేపీ కేంద్రం పెద్దల ఆలోచనగా ఉంది. అందుకే బీజేపీ, జనసేనలు ఈ విషయంలో సైలెంట్ అయ్యారంటున్నారు. శాసనమండలి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం పాజిటివ్ గానే స్పందింస్తుందన్నది ఢిల్ల వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

