స్పీడ్ పెంచారు… లక్ష్యాన్ని చేరుకుంటారా?
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత స్పీడ్ పెంచింది. కొత్త అధ్యక్షులు నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. పార్టీలో కొత్త ఉత్సాహం [more]
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత స్పీడ్ పెంచింది. కొత్త అధ్యక్షులు నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. పార్టీలో కొత్త ఉత్సాహం [more]

భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత స్పీడ్ పెంచింది. కొత్త అధ్యక్షులు నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందనే చెప్పాలి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణలో ఈ స్థానం సులువుగా దక్కే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండో స్థానం కోసం బీజేపీ బాగా శ్రమించాల్సి ఉంటుందంటున్నారు.
టీఆర్ఎస్ బలంగా ఉన్నా……
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని పించేది. కాని గత కొద్దిరోజులుగా బీజేపీ దూకూడు పెంచడంతో కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానానికి పడిపోయినట్లే చెప్పాలి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక మొత్తం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే సాగింది. ఇక్కడ కాంగ్రెస్ ఊసే లేకపోవడం విశేషం. త్వరలోనే తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో……
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇందులో మిషన్ 50గా బీజేపీ నేతలు పెట్టుకున్నారు. యాభై డివిజన్లలో బీజేపీ గెలిస్తే తదుపరి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలనేనన్నది వారి వ్యూహంగా కన్పిస్తుంది. అందుకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తరచూ హైదరాబాద్ లో పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సయితం గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టారు.
ఏపీలో మాత్రం…..
ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ వేగంగా కార్యక్రమాలను చేపడుతుంది. అయితే బీజేపీ ఇక్కడ అధికార పార్టీ కంటే విపక్ష టీడీపీపైనే ఎక్కువ విమర్శలు చేస్తుంది. టీడీపీ ఇప్పుడు వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉంది. దానికి బలమైన క్యాడర్ ఉంది. అయితే బీజేపీకి తెలంగాణలో మాదిరిగా ఇప్పటికిప్పుడు ఏపీలో పట్టు చిక్చే అవకాశాలు లేవు. అయినా టీడీపీని వెనక్కు నెట్టేసి ముందుకు రావాలన్న ప్రయత్నంలోనే ఉంది. ఇద్దరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటంతో బీజేపీని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పక తప్పదు. ఏపీలో కొంచెం కష్టంగానే కన్పించినా తెలంగాణాలో మాత్రం త్వరలోనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతందంటున్నారు.

