అయోధ్య వ్యవహారం న్యూ టర్న్ తీసుకుంటుందా?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాజకీయంగా న్యూ టర్న్ తీసుకునే అవకాశముంది. ఐటీ దాడులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొంత [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాజకీయంగా న్యూ టర్న్ తీసుకునే అవకాశముంది. ఐటీ దాడులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొంత [more]

వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాజకీయంగా న్యూ టర్న్ తీసుకునే అవకాశముంది. ఐటీ దాడులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో ఎంత సఖ్యతగా వెళ్లాలనుకున్నా తమను మాత్రం కవ్విస్తుందని జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాంకీ గ్రూపు సంస్థల పై ఐటీ దాడుల విషయంలో జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ కు సన్నిహితుడిగా…
అయోధ్య రామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే రాంకీ గ్రూపు సంస్థలను సమర్థవంతంగా నడుపుతున్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఆర్థికంగా అండదండలుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోట ీచేసి ఓటమి పాలయ్యారు. జగన్ అధికారంలోకి రాగానే అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభ సబ్యుడిగా చేశారు. రాజ్యసభ సభ్యుడు అయిన వెంటనే రాంకీ సంస్థల డైరెక్టర్ పదవి నుంచి అయోధ్య రామిరెడ్డి తప్పుకున్నారు.
అనుకూల మీడియా….
అయితే అయోధ్య రామిరెడ్డి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే అయోధ్య రామిరెడ్డి సంస్థలపై ఐటీ దాడులు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తుంది. ఆయన బ్యాంకల వద్ద రుణాలు ఎగకొట్టలేదు. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారన్న ఆరోపణలపైనే ఐటీ దాడులు నిర్వహించింది. దాదాపు 300 కోట్ల మేరకు లెక్కలు చూపలేదని ఐటీశాఖ నిర్ధారించింది. దీనిపై విచారణ జరుగుతుంది.
ఈ వ్యవహారంలో….?
కానీ బ్యాంకులకు వందల కోట్ల రుణాలను ఎగకొట్టిన సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామ కృష్ణరాజు, కావూరి సాంబశివరావు లాంటి వారిని వదిలేసిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి ని టార్గెట్ చేసింది. జగన్ కు, ఆయనకు మధ్య ఆర్థిక సంబంధాలపై ఉత్తుత్తి ప్రచారాలకు దిగుతోంది. ఇది జగన్ కు ఇబ్బంది కరంగా మారింది. మొత్తం మీద అయోధ్య రామిరెడ్డి సంస్థలపై ఐటీ దాడుల విషయంలో జగన్ ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తుంది. బీజేపీతో వైఖరి పట్ల జగన్ లో మార్పు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

