అశోక్ బంగ్లాలో ఆయనే అతిధి ?
విజయనగరంలో సుప్రసిధ్ధమైన ప్రాంత్రంగా కోటను చెబుతారు. అలగే మూడు లాంతర్ల జంక్షన్ కూడా పేర్కొంటారు. ఆలాగే మరో ముఖ్య ప్రాంతంగా అశోక్ బంగ్లా చెబుతారు. ఈ బంగ్లా [more]
విజయనగరంలో సుప్రసిధ్ధమైన ప్రాంత్రంగా కోటను చెబుతారు. అలగే మూడు లాంతర్ల జంక్షన్ కూడా పేర్కొంటారు. ఆలాగే మరో ముఖ్య ప్రాంతంగా అశోక్ బంగ్లా చెబుతారు. ఈ బంగ్లా [more]

విజయనగరంలో సుప్రసిధ్ధమైన ప్రాంత్రంగా కోటను చెబుతారు. అలగే మూడు లాంతర్ల జంక్షన్ కూడా పేర్కొంటారు. ఆలాగే మరో ముఖ్య ప్రాంతంగా అశోక్ బంగ్లా చెబుతారు. ఈ బంగ్లా ఎన్నో చరిత్రలకు నిలయంగా ఉంది. ఇక్కడ నుంచే ఎమ్మెల్యే స్థాయి నుంచి కేంద్రంలో కీలకమైన మంత్రిగా అశోక్ గజపతిరాజు ఎదిగారు. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయానికి సాక్షీభూతం అశోక్ బంగ్లా. ఇదిలా ఉండగా అశోక్ గజపతిరాజు గత ఏడాది వరకూ అశోక్ బంగ్లాలో దర్శనమిచ్చేవారు మీడియాను పిలిచి ముచ్చట్లు పెట్టేవారు. తెలుగుదేశం రాజకీయాలకు వేదికగా కూడా బంగ్లా ఉండేది. ఎంతటి పెద్ద నాయకుడు అయిన బంగ్లాకు రావాల్సిందే.
బోసిపోయిందిగా….
అటువంటి అశోక్ బంగ్లా ఇపుడు బోసిపోయింది. గత ఏడాదిగా అశోక్ గజపతి రాజు దూకుడు లేదు, ఆయన పలుకే బంగారం అయింది. టీడీపీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న ఆయన పార్టీ మీటింగుకులకు కూడా రావడంలేదు. పార్టీ నాయకులను కూడా కలవడం లేదు. దాదాపుగా ఆయన స్వీయ రాజకీయ విరమణ పాటించారని అంటున్నారు. జగన్ సర్కార్ వచ్చిన కొత్తలో కొన్ని హార్ష్ కామెంట్స్ చేసిన రాజు గారు ఇపుడు మాన్సాస్ వివాదాల్లో ఇరుక్కున్నారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టుకు వెళ్ళారు. ఆ తీర్పు తనకు అనుకూలంగా వస్తే మాన్సాస్ సేవలో తరించాలని అశోక్ గజపతి రాజు అనుకుంటున్నారు.
ఇక కూతురేనా …..?
ఇక అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ఇపుడు ఎక్కువగా మీడియా సమావేశాలు పెడుతున్నారు. ఆమె సైతం అశోక్ బంగ్లాలోనే వీటిని నిర్వహిస్తున్నారు. వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూ రాజకీయాల్లో తన కుటుంబం ఉందని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత అదితి ఇపుడు పార్టీతోనే ఎక్కువగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆమెకే టికెట్ వస్తుందని అంటున్నారు. రాజకీయ సమీకరణలు సరితూగుతున్నా సామాజికపరంగా కాపు వర్గం మాత్రం అశోక్ గజపతి రాజు కుటుంబం మీద పగపట్టి ఓడిస్తోంది. వారిని మంచి చేసుకుంటేనే అదితి విజయం సాధిస్తుంది అంటున్నారు.
చెప్పేశారా …?
ఇక చంద్రబాబుతో ఎంతో చనువు ఉన్న అశోక్ గజపతిరాజు తాను రాజకీయాల్లో ఉండనని అంటున్నారుట. తన కుమార్తెను ముందు పెట్టి రిటైర్ అవుతానని చెబుతున్నారు. ఆమెకు అవకాశం ఇచ్చి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ చేయాలని కూడా కోరుతున్నట్లుగా తెలుస్తోంది. నాలుగేళ్ళ పాటు ఎటూ ప్రతిపక్షమే కాబట్టి కూతురు రాటుదేలుతుందని అశోక్ గజపతి రాజు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆ వేవ్ ఉంటే తన కూతురుకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అశోక్ తలపోస్తున్నారు. మరి చూడాలి. మొత్తానికి అశోక్ బంగ్లా కాస్తా ఇపుడు అదితి బంగ్లాగా మారిపోయింది. పెద్దాయనను పలకరిద్దామనుకుంటున్న మీడియాకు సైతం ఆయన దర్శనం దొరకడంలేదని అంటున్నారు రాజకీయలకు అతీతంగా ఆయన్ని అభిమానించేవారు.

