ఆంధ్రాలో చాలా నయం.. ఇది నిజం
మనసులో ఏదో మూల ఉన్న భయం, ఆందోళన తొలగిపోయింది. మళ్ళీ అది దాడి చేయదనే భరోసా ఏమి లేదు కానీ ఇప్పటికి అయితే సేఫ్. పోయిన వారం [more]
మనసులో ఏదో మూల ఉన్న భయం, ఆందోళన తొలగిపోయింది. మళ్ళీ అది దాడి చేయదనే భరోసా ఏమి లేదు కానీ ఇప్పటికి అయితే సేఫ్. పోయిన వారం [more]

మనసులో ఏదో మూల ఉన్న భయం, ఆందోళన తొలగిపోయింది. మళ్ళీ అది దాడి చేయదనే భరోసా ఏమి లేదు కానీ ఇప్పటికి అయితే సేఫ్. పోయిన వారం విజయవాడలో ఐదుగురు మీడియా వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు పరీక్ష చేయించుకుంటే బాగుండు అనిపించింది. ఐఎంఏ వాళ్ళు నిర్వహించిన రాపిడ్ టెస్ట్ ల తర్వాత మలి విడత నిర్దారణ పరీక్షలు చేసే సమయానికి బోలెడు రచ్చ జరిగింది. రెండు మూడు రోజులకోసారి మార్కెట్ కో, కూరగాయలకో వెళ్ళక తప్పడం లేదు. పండ్లు, కాయలు కొనక తప్పడం లేదు. ఎవరితో చేతులు కలపకపోయినా ఎటు నుంచి ఒంట్లోకి వస్తుందో తెలీదు కాబట్టి పరీక్ష చేయించుకోవాలి అనుకుని రెండు మూడు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లినా పని కాలేదు.
సామాజిక వెలి భయంతో…
అప్పటికే విదేశాల నుంచి వచ్చిన కిట్లు అయిపోవడంతో రెండు మూడు రోజుల పాటు పరీక్ష లు చేయలేమని చేతులెత్తేశారు. అత్యవసర సేవలలో భాగంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే టెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కొందరు ముఖ్యమైన వ్యక్తులకు చెబితే వాళ్ళు రెండు మూడు రోజుల్లో అందరికీ చేయిస్తామని, కొద్దిగా ఓపిక పట్టమని కోరారు. అన్నట్టుగానే నాలుగు రోజుల క్రితం పరీక్షలు చేస్తున్నాం, జర్నలిస్టులు ఎవరు రాకపోతే నీకు మూడిందే అన్నారు సరదాగా…. ఆ రోజు ఉదయం నుంచి చాలా మంది ఓపిగ్గా ఎదురు చూసి మధ్యాహ్నానికి పరీక్షలు చేయించుకున్నారు. అదృష్టవశాత్తు అందరికి నెగటివ్ వచ్చింది. సామాజిక వెలి భయంతో చాలా మంది పరీక్షలకు భయ పడుతున్నారు. కరోనా కంటే పాజిటివ్ వస్తే వాళ్ళ మీద జనం చూపే ఏహ్య భావన కారణంగా పరీక్షలకు కూడా వెనకాడుతున్నారు. జనంలో పేరుకుపోయిన అపోహలు, అద్దె ఇళ్లలో ఉండే వారికి ఉండే సమస్యలతో పరీక్షలకు చాలా మంది వెనకాడుతున్నారు.మొత్తం మీద ఆ రోజు ఓ 75మంది స్వాబ్ టెస్టు చేయించుకున్నారు. 48గంటల తర్వాత అందరికి ఫలితాలు వచ్చాయి.
ఆంధ్రలో నయం…..
కరోనా పరీక్షల విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగ్గా ఉంది. మొన్నీ మధ్య నా ఢిల్లీ మిత్రులు ఈ పరీక్షల విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారో గుర్తుంది. ఎలాంటి లక్షణాలు లేని వారికి అక్కడి ప్రభుత్వం పరీక్షలు నిరాకరిస్తోంది. ఇక్కడ కూడా కొన్ని జిల్లాలలో ఈ పరిస్థితి ఉంది. చాలా రాష్ట్రాలలో కేసులు తక్కువగా ఉండటానికి ఇదొక కారణం. వైద్య సేవలు, ఇంటింటి పరీక్షల విషయంలో మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో పరిస్థితి మెరుగ్గా ఉంది. (కర్ణాటక, తమిళనాడు మిత్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా) ఢిల్లీలో ఓ పాజిటివ్ కేసు వెలుగు చూసిన తర్వాత మిగిలిన వారు రూ.4500 ఖర్చుతో అపోలోలో పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీలో మొదట బయట పడిన కేసుకు సంబంధించిన బాధితుడు వైద్య సేవలు పొందడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఆ తర్వాత వెలుగు చూసిన కేసుల్లో ఢిల్లీలో సరైన సదుపాయాలు లేకపోవడంతో కొందరు మిత్రులు హర్యానాలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని నగరం విస్తీర్ణంలో తక్కువ కావడం, ఆస్పత్రుల సామర్థ్యం తక్కువ ఉండటం అక్కడి ప్రభుత్వాలకు కొంత ప్రతిబంధకం అయ్యుండొచ్చు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి నాటికి 77, 234 మందికి పరీక్షలు చేస్తే 6318 మందికి పాజిటివ్ వచ్చింది. 68మంది చనిపోయారు. ప్రతి 10లక్షల మందిలో 2224మందికి పరీక్షలు చేస్తున్నారు. బయట పడుతున్న కేసుల శాతం 8.18% ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో 1,65,069 మందికి పరీక్ష చేస్తే 1930 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లోపాలు లేవని నేను చెప్పను కానీ చేస్తున్న పనులు కూడా ప్రభుత్వం చెప్పుకోలేక పోతుంది అనిపిస్తోంది.
– శరత్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్

