జగన్ `అభివృద్ధి` నడక!
2019-20 వార్షిక బడ్జెట్లో జగన్ అభివృద్ధి దిశగా నడక ప్రారంబించారు. అనేక కీలక కార్యక్రమాలకు వందల కోట్లలో నిధులు కేటాయించారు. తాజాగా శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఆర్థిక [more]
2019-20 వార్షిక బడ్జెట్లో జగన్ అభివృద్ధి దిశగా నడక ప్రారంబించారు. అనేక కీలక కార్యక్రమాలకు వందల కోట్లలో నిధులు కేటాయించారు. తాజాగా శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఆర్థిక [more]

2019-20 వార్షిక బడ్జెట్లో జగన్ అభివృద్ధి దిశగా నడక ప్రారంబించారు. అనేక కీలక కార్యక్రమాలకు వందల కోట్లలో నిధులు కేటాయించారు. తాజాగా శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జె ట్ అటు రైతులకు, ఇటు సామాన్యులకు భరోసా ఇస్తూనే.. మరోపక్క, రాష్ట్ర అభివృద్ది దిశగా కూడా అడుగులు వేసింది. మొత్తం 2 లక్షల 27 వేల 974 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్లో రైతులకు సింహభాగం కేటాయింపులు జరగగా.. అభివృద్ధి దిశగా కూడా జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది.
ఉపాధి కల్పనకు…..
రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడం ద్వారా ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్న జగన్.. ఆదిశగానే కేటాయింపులు చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విభజన సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వే షించారు. ఈ క్రమంలోనే ఉపాధి పెంపు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూనే.. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు వ్యూహాన్ని చక్కగా అమలు చేశారు. ఈ క్రమంలోనే ఉపాధికల్పన రంగానికి, కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, వైఎస్సార్ బీమాకు 404 కోట్లు కేటాయించి ఆయా వర్గాలను సంతృప్తి పరిచారు.
ఆర్టీసీని ఆదుకునేందుకు…..
ఇక, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని బడ్జెట్లో స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకానికి పెద్ద పీట వేశారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి లభించి, గ్రామీణ నిరుద్యోగం తగ్గుముఖం పడుతుందని తన ప్రసంగంలో ప్రస్తావించిన మంత్రి బుగ్గన దీనికి గాను రూ.500 కోట్లను మ్యాచింగ్ గ్రాంట్ కింద బడ్జెట్లో కేటాయించారు. నిజానికి గడిచిన రెండేళ్లుగా ఉపాధి హామీ పథకానికిగత ప్రభుత్వం స్వల్ప మొత్తంలోనే కేటాయింపు చేసింది. బియ్యంపై ఉన్న సబ్సిడీని 3 వేల కోట్ల రూపాయలకు పెంచడం ద్వారా సామాన్యులకు సన్న బియ్యం ఇవ్వాలన్న సంకల్పాన్ని జగన్ నెరవేర్చుకునే ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. 19 వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసిని ఆదుకునేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించడం బడ్జెట్లో ఇదే ప్రథమమని ఆర్టీసీ వర్గాలు సైతం చెబుతున్నాయి.
అమరావతికి అరకొరగా…..
అమరావతి నిర్మాణానికి రూ.500 కోట్లను కేటాయించారు. అదేవిధంగా గ్రామీణ రహదారుల బాగుచేత, కొత్త రోడ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం 300 కోట్లను కేటాయించింది. రైతుల విత్తన సరఫరాకు రూ.200 కోట్లను కేటాయించడం ద్వారా విత్తనాల కోసం తిప్పలు పడుతున్న రైతుల కష్టాలు ఈ ఏడాది నుంచే తీరిపోనున్నాయి. ఇలా మొత్తంగా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూనే.. మరో పక్క అభివృద్ధి మంత్రంతో జగన్ ముందుకు సాగారని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుండడం గమనార్హం.