Fri Dec 05 2025 13:19:55 GMT+0000 (Coordinated Universal Time)
Indrakiladri : రాత్రి నుంచి క్యూ లైన్ లలో భక్తులు... నేడు సరస్వతీ దేవీ అలంకారంలో దుర్గామాత
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమాత నేడు సరస్వతి మాతగా భక్తులకు దర్శనమివ్వనున్నారు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమాత నేడు సరస్వతి మాతగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా నిన్న రాత్రి 11 గంటల నుండి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించారు. రాత్రి 12 గంటలకు సరస్వతి అలంకరణలో దర్శనం ఇవ్వనుంది. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రికి మూడు లక్షల మంది పైచిలుకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల నుండి నాలుగు గంటల 30 నిమిషాల మధ్య సమయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మూలా నక్షత్రం కావడంతో...
మూలా నక్షత్రం కావడంతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. నేడు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన ఆలయ అధికారులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీ వివిఐపి దర్శనాలు రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లు ఉచిత దర్శనాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకూ కు సరస్వతి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని సెప్టెంబర్ 29, సోమవారం నాడు అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రాన చైతన్య స్వరూపిణీ అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తుండటంతో అత్యధిక మంది భక్తుల వస్తారు.
రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజీపైన....
ఈరోజు మూలా నక్షత్రాన ముఖ్యమంత్రితో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు, పార్కింగ్, తాగునీరు, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ఇలా అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించారు. నిన్న రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి పై రాకపోకలను నిలిపివేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూల నక్షత్రం కావడంతో, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం బ్యారేజి పై వాహన రాకపోకలు ను ఆదివారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు పూర్తిగా నిషేదించారు. క్యూలైన్ కొండ కింద వరకూ విస్తరించి ఉంది. బస్సులను కూడా పైకి అనుమతించరు. కేవలం ముఖ్యమంత్రి వాహనాన్ని తప్పించి ఏ వాహనాన్ని అనుమతించరు.
Next Story

