Fri Dec 05 2025 12:42:00 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : దీపావళిని చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే
దీపావళి పండగ అందరం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. దీపావళి అంటే దిపాల పండగ

దీపావళి పండగ అందరం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. దీపావళి అంటే దిపాల పండగ. వెలుగుల పండగ. స్వీట్లు, టపాసులతో ఆనందంతో జరుపుకునే దీపావళి అంటే ఒక పండగ అని మాత్రమే అందరికీ తెలుసు. దీపావళి అంటే ఠక్కున గుర్తొచ్చేది పండగ. అయితే దీపావళి ఎందుకు చేసుకుంటామన్నది కూడా అందరికీ తెలిసిందే. నరాకాసురుడిని సత్యభామ వధించిన రోజు దీపావళి జరుపుకుంటారు. కానీ అలాంటి దీపావళి పేరిట ఊరు ఒకటి ఉంది. అదీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ ఊరు పేరు దీపావళి. దీపావళి అంటే పండగ కాదు.. బస్సు ఎక్కి దీపావళికి ఒక టిక్కెట్ ఇవ్వమంటే ఇచ్చేటంత పేరున్న గ్రామం ఇది. అసలు ఈ గ్రామానికి దీపావళి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?
సిక్కోలు జిల్లాలోని...
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. అయితే ఈ ఊరికి దీపావళి అనే పేరు పెట్టడానికి చరిత్ర కూడా ఉందంటారు గ్రామస్థులు. శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అనే నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. సిక్కోలు రాజు గుర్రంపై అటుగా వెళ్లేటప్పుడు ఎండకు తాళలేక ఆ గ్రామ సమీపంలోని కొబ్బరితోటలో స్పృహతప్పి పడిపోయాడట. వెంటనే అక్కడ కూలీలు ఆయనను చూసి ఆయనకు ప్రాధమిక చికిత్స అందించారు. ఆయన తేరుకుని వారిని అభినందించారు. అదే రోజు దీపావళి కావడంతో ఆ గ్రామానికి ఆ రాజు దీపావళిగా నామకరణం చేసినట్లు పెద్దలు చెబుతారు. అప్పటి నుంచి ఆ గ్రామానికి దీపావళిగా పేరు స్థిరపడిపోయింది.
పదిహేను వందల మంది జనాభా...
రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ గ్రామం పేరు దీపావళిగానే ఉంది. గార మండలం కొంటి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ దీపావళి గ్రామంలో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకూ జనాభా ఉంటారు. అయితే దీపావళి పండగ పేరును తమ గ్రామానికి రావడం పట్ల గ్రామ ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. ఈ తరం యువత కూడా దీపావళి గ్రామానికి వచ్చి పండగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఎక్కడెక్కడో ఉన్న వారు దీపావళికి దీపావళికి చేరుకుని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈ గ్రామంలో మూడు నుంచి నాలుగు వందల వందల ఇళ్లున్నాయి. అందుకే దీపావళి అంటే ఇక్కడ పండగ మాత్రమే కాదు.. ఊరు కూడా ఈరోజు వెలిగిపోతుంది.
Next Story

