Fri Dec 05 2025 08:13:54 GMT+0000 (Coordinated Universal Time)
Diwali 2025 : పండగ చేసుకోండి.. ప్రమాదాలను కొని తెచ్చుకోకండి
ఈరోజు ఆనందకరమైన దీపావళి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు.

ఈరోజు ఆనందకరమైన దీపావళి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఆనందోత్సాహాల మధ్య చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ టపాసులు పేలుస్తూ పండగ చేసుకుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదం బారిన పడతారు. నూతన వస్త్రాలను ధరించి దీపావళి పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం నుంచి టాపాసులు పేల్చుతూ ఆనందం పొందుతారు. కానీ తే దీపావళి టపాసులు పేలుస్తున్న సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. చాలా మంది కంటి సంబంధిత బాధతో ఆసుపత్రులకు పండగ నాటు పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పెద్దలు దగ్గరుండి...
చిన్నారులు ప్రమాదం బారిన పడకుండా పెద్దలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. పిల్లలను పక్కనే ఉండి టపాసులను వారి చేతి కాలిపించి ప్రమాదానికి దూరంగా ఉంచాలి. ప వైద్యులు ప్రధానంగా చెబుతున్నది కళ్లను భద్రంగా ఉంచుకోవాలని, దీపావళి టపాసులను కాల్చే సమయంలో కళ్లజోడు విధిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ేటా చిన్నారులు కంటికి సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతూ దీపావళి రోజును ఆసుపత్రికి వస్తుండటం పరిపాటిగా మారింది. చిచ్చు బుడ్లు, విష్ణు చక్రాలు, భూ చక్రాలు, కాకరపువ్వొత్తులు వంటివి కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కళ్లజోడు ధరించడమే కాదు.. ఒంటిపై లూజుగా దుస్తులను ధరించాలని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.
చిన్న నిప్పురవ్వ కూడా...
చిన్న నిప్పు రవ్వ పడినా ప్రమాదం జరుగుతుంది. టపాసులు కాల్చే సమయంలో షూ ధరించడం మేలు అన్నది వైద్య నిపుణుల సూచన. ప్రతి ఏటా సరోజినిదేవి కంటి ఆసుపత్రికి పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు చికిత్స కోసం దీపావళి పండగరోజు నాడే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరంతా అజాగ్రత్తతోనే తాము ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గాయపడిన కంటిని వెంటనే నలపకూడదు. చల్లని నీటితో శుభ్రపర్చి వెంటనే నేత్రవైద్యుడిని సంప్రదించాలి. కంటి వద్ద సబ్బు లాంటి పదార్థాలు వాడకూడదు. గాయపడిన కంటిన మూసే ఉంచాలి. మంచి మతాబులనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే మనం జాగ్రత్తగా ఉన్నా అవి పేలిపోయే అవకాశముందని కొందరు చెబుతున్నారు.
Next Story

