Fri Dec 05 2025 12:40:22 GMT+0000 (Coordinated Universal Time)
Diwali : దీపావళి తేదీపై అయోమయం.. పంచాంగకర్తల మధ్య కుదరని సయోధ్య
దీపావళి తేదీపై అయోమయంగా నెలకొంది

దీపావళి తేదీపై అయోమయంగా నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సోమవారం దీపావళిని జరుపుకుంటుండగా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు మంగళవారం పండుగ చేసుకోనున్నాయి. పంచాంగ రచయితల మధ్య తేదీ విషయంలో అయోమయం నెలకొంది. పంచాంగాలు సిద్ధం చేయడంలో రెండు పద్ధతులు అమలులో ఉన్నాయి. ద్రిక్ గణిత, పూర్వ గణిత. ఈ రెండింటిలో ఏ పద్ధతి అనుసరించాలో నిర్ణయించడంలో రచయితల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు వర్గాలూ తమ లెక్కలే నిజమని చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
సంప్రదాయ పద్ధతి ప్రకారం తెలుగు రాష్ట్రాల పంచాంగకర్తలు దీపావళి తేదీని అక్టోబర్ 20 గా నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి టంగిరాల వెంకటపూర్ణకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రాల ప్రకారం సాయంత్రానికి ముందున్న ప్రదోషకాలంలో వచ్చే తిథినే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఆ విధానం ప్రకారం అమావాస్య తిథి ప్రదోషకాలంలో ఉండటంతో దీపావళి సోమవారం జరుపుకోవాలని వివరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా సోమవారం సెలవు ప్రకటించాయి.
ఉత్తరాదిన....
అయితే సిద్ధాంత పంచాంగకర్తలు వేరే నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని సనాతన ధర్మ ప్రతినిధి సభ, సనాతన ధర్మ సభ, బిర్లా మందిరంలోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయాలు అక్టోబర్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న పంచాంగకర్తలతో సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో అక్టోబర్ 21న దీపావళిని జరుపుకోవాలని తీర్మానం చేశారు. ప్రజలు అయోమయానికి గురికాకుండా శాస్త్రీయ లెక్కలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీంతో తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రంలో రేపు దీపావళిని జరుపుకుంటున్నారు.
Next Story

