Fri Sep 13 2024 02:43:23 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, జూన్ 18 నుండి 24 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నుంచి మూడు నెలల వరకూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలకు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, ఆదివారం
తిథి : బ.అమావాస్య ఉ.10.08 వరకు
నక్షత్రం : మృగశిర సా.6.08 వరకు
వర్జ్యం : రా.3.15 నుండి 4.59 వరకు
దుర్ముహూర్తం : సా.5.04 నుండి 5.56 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు : లేవు
నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
వృషభం - బుధుడు
మిథునం - రవి
కర్కాటకం - కుజుడు, శుక్రుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
మిథునం, కర్కాటకం, సింహం
జూన్ 18 నుండి 24 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలం. సంఘంలో గౌరవం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు అనుకూలం. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. నీరసం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలం. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని ఖర్చులుంటాయి. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. బంధువర్గంతో అంటీ ముట్టనట్టుగా ఉంటారు. కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. విలాసాలు, వినోదాలకు ఇబ్బంది ఉండదు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విద్యార్థులు అధికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వాగ్వాదాలు పెరుగుతాయి. పిత్రార్జితం, తండ్రితో మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కలసివస్తాయి. అప్పులు చేస్తారు. మీకు నచ్చినట్టుగా ఉండటంతో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నుంచి మూడు నెలల వరకూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యమిస్తారు. తగాదాలు పెరుగుతాయి. కెరియర్లో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అప్పు తీసుకుంటే.. ఊహించిన దానికంటే వడ్డీ పెరుగుతుంది. గతంలో ఇచ్చిన అప్పులు వసూలవ్వక ఇబ్బంది పడతారు. విద్యార్థులు కూడా అధికంగా శ్రమించాలి. ఈ వారం బుధవారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్థిరచరాస్తులపై దృష్టిసారించేందుకు అనుకూలమైన కాలం. ఖర్చులు పెరుగుతాయి. వాహనయోగం ఉంటుంది. అధికారులతో జరిపే చర్చలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యాగాల్లో చేసుకునే మార్పులు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులుగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు వేగంగా సాగవు. ప్రయాణాలు కలసివస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. అపార్థం చేసుకున్నవారే అర్థం చేసుకుని అనుకూలంగా ఉంటారు. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం, షూరిటీ సంతకాలు చేయకపోవడం మంచిది. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు రాబోయే నెలరోజుల వరకూ జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో వాగ్వాదాలకు దిగుతారు. కెరియర్ చిరాకుగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను యాంత్రికంగా చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారే వెనుక గుసగుసలాడటం నొప్పిస్తుంది. ఎదుటివారిని మార్చాలన్న ప్రయత్నం వృథా ప్రయాసే. ఆర్థికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఏదేమైనా ఏం జరిగితే అది జరుగుతుందని.. చేయాల్సిన పనిచేస్తారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా మరింత జాగ్రత్తగా ఉంటారు. రూపాయిని రెండు రూపాయలు చేయాలన్న ఆలోచనతో నష్టపోతారు. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఎదుటివారి నమ్మకాన్ని కాపాడుకోవాలి. తెలియని ఒత్తిడి, కోపం, చికాకుతో ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు పెరుగుతాయి. విడాకుల గురించి ఆలోచించకపోవడం మంచిది. వివాహ ప్రయత్నాల్లో నిరుత్సాహం ఎదురవుతుంది. ఉద్యోగ, వ్యాపారపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేన్నైనా ఎదుర్కోగలిగే ధైర్య, సాహసాలతో ఉంటారు. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యమిస్తారు. ఎవరి కర్మ వారిదన్నట్టుగా ఉండటం ఆనందంగా గడుపుతారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల వాతావరణం ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతారు. వ్యాపారస్తులకు ఒత్తిడులను తట్టుకునే పరిష్కారమార్గాలు లభిస్తాయి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. సుఖసౌఖ్యాలు తగ్గుతాయి. ఎవరికి సమాధానం చెప్పకపోయినా.. అంతా చెడే చేశారన్న నిందలు పడాల్సి ఉంటుంది. అన్నింటా జాగ్రత్తగా ముందుకి వెళ్లాలి. కొనుగోళ్ల విషయాల్లో ఇబ్బందులుండవు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story