Wed Dec 17 2025 06:01:39 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల నేడు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. గత శుక్రవారం నుంచి మంగళవారం వరకూ తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే ఈరోజు భక్తుల సంఖ్య కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. కంపార్ట్ మెంట్లన్నీ కొన్ని ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో స్వామి వారిని సులువుగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు వసతి గృహాలు కూడా సులభంగా దర్శనం లభిస్తుంది. అలాగే అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా పెద్దగా భక్తుల రద్దీ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ధనుర్మాసం ప్రారంభం కావడంతో...
ధనుర్మాసం ప్రారంభం కావడంతో సహజంగా భక్తుల రద్దీ పెరుగుతుంది. అయితే వారం మధ్య కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉందని తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశముందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇక లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. అయితే పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాదకరమని, జాగ్రత్తగా చేయాలని భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,738 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,746 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.79 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

