Fri Dec 12 2025 05:30:20 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. మంగళవారం నుంచే భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. చలి కాలం కావడంతో తీర్థయాత్రలకు వెళ్లే వారు తిరుమలను దర్శించడం సంప్రదాయంగా వస్తుందని, అందుకే ఇటీవల కాలంలో భక్తులు రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. జనవరి నెలాఖరు వరకూ ఈ రద్దీ కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
హుండీ ఆదాయం...
తిరుమలకు భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగానే పెరిగింది. నెలకు 120 కోట్ల రూపాయల వరకూ శ్రీవారి ఆదాయం లభిస్తుంది. లడ్డూల ద్వారా కూడా అధికంగానే ఆదాయం లభిస్తుంది. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లను చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తులు ప్రతి రోజూ అరవై నుంచి ఎనభై వేల మంది వరకూ వస్తున్నారని, వచ్చిన వారందరికీ దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. రోజుకు ఎనభై వేల మందికిపైగా శ్రీవారిని దర్శించుకున్న రోజులు కూడా ఉన్నాయంటున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,367 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో es : 25,193 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

