Sun Mar 22 2026 09:39:19 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లేవారు నేడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మజ్జిగ, అన్న ప్రసాదం, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.
నిత్యం పెరుగుతూనే...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. హుండీ ఆదాయం కూడా ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. వారంతో సంబంధం లేకుండా, సెలవులతో నిమిత్తం లేకుండా తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో లడ్డూ ఆదాయం కూడా భారీగా పెరిగింది. అలాగే అన్న ప్రసాదం కేంద్రంలోకి వచ్చినే భక్తులు అందరికీ వాటిని అందించేలా అవరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు.
బాట గంగమ్మ ఆలయం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 77,864 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలను 39,348 మంది భక్తులు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

