Sun Mar 29 2026 10:42:24 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు నేడు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం వెంటనే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం అయినా భక్తుల రద్దీ నేడు పెద్దగా లేదు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ఈ మూడు రోజులు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆదివారం మాత్రం ఆశించనంత రీతిలో భక్తుల రద్దీ లేదు. భక్తులు సులువుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
వేసవి రద్దీని తట్టుకునేలా...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇక పెరగనుంది. వేసవి కాలం కావడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ఉండటం, పరీక్ష ఫలితాలు కూడా వచ్చే అవకాశముండటంతో జూన్ నెల వరకూ తిరుమలలో భక్తుల రద్దీ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి రద్దీని తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టారు. క్యూ లైన్లలోనూ, కంపార్ట్ మెంట్లలోనూ భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం టోకెన్లున్న భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,606 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.18 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

