Sat Mar 21 2026 10:34:28 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. శనివారం.. దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈరోజుర శనివారం కావడంతో భక్తులు మరింత ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. దీంతో క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను, మజ్జిగ, పాలు, మంచినీటిని శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అధిక సంఖ్యలో భక్తులు...
కొన్ని పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. శుభకార్యాలు తమ ఇంట ముగించుకుని తిరుమలకు చేరుకుని మరికొందరు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి రద్దీ పెరగక ముందే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చాలా మంది తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లున్న భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,008 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,001 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

