Mon Mar 09 2026 11:05:58 GMT+0530 (India Standard Time)
Tirumala : నేడు తిరుమలకు వెలుతున్నారా.. మీకొక అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలలోని కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. శుక్రవారం మొదలయిన రద్దీ సోమవారం కూడా కొనసాగుతుంది. నేడు కూడా గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
వేసవి రద్దీతో...
సాధారణంగా సోమవారం పనిదినం కావడం, ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో తిరుమలకు భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుందని భావించి వెళ్లిన వారు గంటల తరబడి దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ కావడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రానున్న కాలంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని, వేసవి రద్దీని తట్టుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
31 కంపార్ట్ మెంట్ల లో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్ల లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,879 గా ఉంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 25,520 మంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు అని అధికారులు తెలిపారు.
Next Story

