Sat Feb 28 2026 14:09:37 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లే వారు ఇకపై ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండివపోయాయి. బయట వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. తిరుమలకు శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభప్రదమని నమ్ముతారు. అందుకే శనివారం నాడు తిరుమలలో స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
వసతి గృహాలు కూడా...
శుక్రవారం ప్రారంభమయిన రద్దీ తిరుమలలో సోమవారం వరకూ కొనసాగుతుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుండటంతో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే తిరుగు ప్రయాణమవుతారు. అందుకోసం భక్తులు రెండు రోజులైనా దర్శనం కోసం వేచి చూస్తుంటారు. ఇక వేసవి కాలంలో భక్తుల రద్దీమరింత పెరుగుతుంది. వసతి గృహాలు కూడా దొరకడం కష్టం. చాలా మంది తిరుపతిలో గదులు తీసుకుని తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. ఈరోజు కూడా దాదాపు అదే పరిస్థితి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది హేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టై్మ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. వరీిలో 27,414 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

