Fri Mar 27 2026 23:40:12 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు .. కారణం ఏంటంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ నేడు కూడా కంటిన్యూ అవుతుంది. శుక్రవారం ప్రారంభమయిన రద్దీ తిరుమలలో నేడు కూడా కొనసాగుతుందని ముందుగానే అంచనా వేసిన అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. సహజంగా మూడు రోజుల రద్దీ మంగళవారానికి కాని కొంత తగ్గదు. తిరిగి శుక్రవారం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ రోజుల్లో. మరి వేసవి సెలవులు, ఇతర పండగ సెలవుల్లో ఇతర రోజుల్లో తిరుమలకు వారంతో సంబంధం లేకుండా భక్తుల రద్దీ కొనసాగుతుంది.
రోజురోజుకూ పెరుగుతున్న భక్తులు...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అవసరమైన అదనపు కంపార్ట్ మెంట్లతో పాటు వసతి గృహాల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటున్నారు. తిరుమలకు రోజుకు అరవై వేల మందికి పైగానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. అందులో శుక్రవారం నుంచి ఆది వారం వరకూ ఎనభై వేల మంది ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. అయినా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారుల తెలిపారు.
పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈ సమయం మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,894 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,754 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.91 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

