Fri Jan 23 2026 04:52:17 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్
తిరుమలకు భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలకు భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. లడ్డూ విక్రయాలు కూడా అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. అన్నదాన సత్రం వద్దకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అందరికీ ప్రసాదం అందేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వసతి గృహాలు కూడా దొరకడం కొంత ఆలస్యమవుతుందని భక్తులు చెబుతున్నారు.
రోజురోజుకూ భక్తుల సంఖ్య...
తిరుమలకు వచ్చే భక్తుల రాక ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. గతంలో ఒక్క వేసవిలోనే భక్తుల రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. వారాలతోనూ, సీజన్ తోనూ సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. రైళ్లు, బస్సులు, విమానాలు ఇలా అనేక మార్గాల్లో భక్తులు తరలి వచ్చి శ్రీవారి చెంత మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు రోజుకు డెబ్భయి నుంచి ఎనభై వేల మంది వరకూ వస్తుండటంంతో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. స్వామి వారి దర్శనం సులువుగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,571 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో ures : 23,634 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

