Mon Feb 02 2026 04:17:41 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. గత మూడు రోజుల నుంచి రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం మొదలయిన రద్దీ నేడు కూడా కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రోజుకు దాదాపు ఎనభై వేల మంది భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఎనభై వేల మంది భక్తులు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
వసతి గృహాలతో...
తిరుమలకు వచ్చే భక్తులు రెండు రోజుల పాటు కొండ మీద ఉండటంతో వసతి గృహాల లభ్యత కూడా కొంత కష్టంగా మారింది. దర్శనం చేసుకోవాలన్నా, ముందుగా బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉన్నా ఒకరోజు ముందుగానే తిరుమలకు చేరుకుంటారు. అక్కడ వారికి వసతి గృహం కేటాయించాల్సి ఉంటుంది. మరుసటి రోజు దర్శనం చేసుకుని సాయంత్రానికి కానీ ఖాళీ చేయలేని పరిస్థితి ఉంది. అందుకే తిరుమలకు వచ్చేభక్తులకు వసతి గృహాల సమస్య ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఐదు కంపార్ట్ మెంట్లలోనే ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,192 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,313 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.57 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

