Mon Dec 15 2025 05:41:40 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళ్లేవారికి టీటీడీ సూచనలివే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. శని, ఆదివారాలు తిరుమల భక్తుల రద్దీతో కిటకిట లాడింది. ఆ రద్దీ సోమవారం కూడా కొనసాగుతుంది. తిరుమలకు వచ్చిన భక్తులు కనీసం రెండు రోజుల పాటు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. వసతి గృహాలు కూడా రెండు రోజుల వరకే అనుమతించనుండటంతో రెండు రోజుల పాటు కొండ మీద ఉండి ఆధ్మాత్మిక వాతావరణంలో మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా...
గత కొద్ది రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సీజన్ లో తీర్ధయాత్రలను కూడా ఎక్కువ మంది చేస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించే పర్యటనలో భాగంగా తిరుమల ప్రధానంగా ఉంటుంది. అందుకే తిరుమల ఇటీవల కాలంలో నిత్యం కిటకిట లాడుతుంది. అదే సమయంలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే పడుతుంది. నిన్న శ్రీవారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 26,150 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

