Fri Oct 04 2024 06:23:35 GMT+0000 (Coordinated Universal Time)
MAY 6 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా సాగుతుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శనివారం
తిథి : బ.పాడ్యమి రా.9.48 వరకు
నక్షత్రం : విశాఖ రా.9.09 వరకు
వర్జ్యం : రా.1.00 నుండి 2.33 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.51 నుండి 7.33 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.30 వరకు, సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో మంచి స్థితిగతులు ఏర్పడుతాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యమైన సమస్యలో నుండి బయటపడేందుకు తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి స్థితిగతులు ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 3.30 తర్వాత అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకూ మీరేం మాట్లాడినా ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. వృథా ఖర్చులుంటాయి. మధ్యాహ్నం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా సాగుతుంది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఎదుటివారి మాట విని మోసపేయే అవకాశాలెక్కువ. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా అలసట పెరుగుతుంది. ముఖ్యమైన పనులను మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 3.30 వరకూ వీలైనంతమేర పనులను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తెలియని ప్రశాంతత ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తెలియని ఆందోళన వెంటాడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, ఊరట లభిస్తాయి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృథాఖర్చులుంటాయి. మాట పట్టింపులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, చర్చలు, ఇంటర్వ్యూలు, ఆర్థిక సమీకరణాలు, క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై దృష్టిసారిస్తారు. చేసిన అప్పులు తీర్చేందుకు, నూతన రుణ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం ఉంటుంది. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. లౌక్యం ప్రదర్శిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 3.30 తర్వాత అనుకూలం. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
Next Story