Fri Dec 05 2025 13:34:19 GMT+0000 (Coordinated Universal Time)
Karthika Masam 2025 : కార్తీక మాసం వచ్చేస్తుంది... ఎప్పటి నుంచి అంటే.. ఏమేం చేయాలో తెలుసా?
కార్తీక మాసం వచ్చేస్తుంది. పరమశివుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం.

కార్తీక మాసం వచ్చేస్తుంది. పరమశివుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఏటా దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ సారి కూడా ఈ నె 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం వచ్చే నెల 20వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ మాసంలో శివారాధన చేయడం మంచిదని భావిస్తారు. అశ్వయుజ బహుళ అమావాస్య ఈ నెల 21వతేదీ. 21వ తేదీతో అశ్వయుజ మాసం ముగుస్తుంది. అక్టోబరు 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివారాధన చేస్తారు. ఉపవాసాలు ఉంటారు. శైవక్షేత్రాలు సందర్శిస్తారు. అత్యంత భక్తితో పూజలు చేస్తారు. మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు.
శివారాధన చేస్తూ...
కార్తీక మాసంలో ప్రతి రోజూ ఒకపూటే ఆహారం తీసుకుంటారు. శివారాధన చేయడంతో పాటు ఉపవాసం చేస్తే ఆరోగ్య పరంగా మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, వన భోజనాలు జరుగుతాయి. కార్తీక సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక సోమవారం నాడు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఉపవాసం ఉంటారు. రాత్రికి శివపూజ చేసిన తర్వాత ఫలాలు తీసుకుని ఉపవాసాన్ని ముగించడం సంప్రదాయంగా వస్తుంవది. కార్తీక మాసంలో దేశంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాలన్నింటినీ హిందులువు దర్శించుకుంటారు. శివారాధనతో కుటుంబం ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలతో ఉంటుందన్న విశ్వాసంతో ఆలయ దర్శనాలను చేసుకుంటారు.
శైవక్షేత్రాలు.. సముద్ర స్నానాలు...
కార్తీక మాసంలో తమ ఇంట్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళార్చన, లక్ష కుంకుమార్చనలు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది క్షేత్రాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కార్తీక మాసం వేళ నదీ స్నానాలు చేయడం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని నమ్ముతారు. ఈ మాసంలో ప్రతి రోజూ ఉదయం నిద్రలేచి మహిళలు స్నానమాచరించిన అనంతరం కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. తమ ఇంట్లో ఉన్న తులసి కోట వద్ద దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఆరోజు 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. నదుల్లో దీపాలను వదులుతారు.
Next Story

