Sun Oct 06 2024 00:36:01 GMT+0000 (Coordinated Universal Time)
JULY 28 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తక్కువగా మాట్లాడి.. ఎక్కువగా వినడం మంచిది. శపథాలకు, మొండితనం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, శుక్రవారం
తిథి : శు.ఏకాదశి మ.12.59 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ రా.11.29 వరకు
వర్జ్యం : ఉ.6.07 నుండి 7.38 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.58 నుండి 7.41 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విషయాల్లోనూ రహస్యంగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. విద్యార్థులు శ్రద్ధగా ఉండాలి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రొటేషన్లు కష్టమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. రుణబాధల నుంచి బయటపడే ప్రయత్నాలు కలసివస్తాయి. ఎలాంటి చర్చలైనా మంచి ఫలితాలుంటాయి. మానసిక సంతృప్తి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అయినవారితోనే మాటపట్టింపులు రావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. నిరాశ, నిస్పృహ పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు తారుమారవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. శత్రుబలం, దృష్టిదోషం అధికమవుతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. సంతకానికి విలువ ఉన్న ఉద్యోగాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చర్చలకు, ఒప్పంద పత్రాలు, డాక్యుమెంటేషన్లకు, వస్తుసామాగ్రి కొనుగోళ్లకు సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తక్కువగా మాట్లాడి.. ఎక్కువగా వినడం మంచిది. శపథాలకు, మొండితనం, కోపానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. వృథా ప్రయాణాలు అలసటను పెంచుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పెద్దగా ప్రశాంతత ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకునేదొకటి.. జరిగేది మరొకటిగా ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. విద్యార్థులు అధిక శ్రద్ధ తీసుకోవాలి. వాహన మరమ్మతుల విషయంలో ఏమరపాటు పనికిరాదు. అపార్థాలను ఆదిలోనే అడ్డుకోవడం మేలు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తుభద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. చికాకులు పెరుగుతాయి. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. శారీరక, మానసిక శ్రమ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సానుకూలంగా ఉంటుంది. మనసులో ఉన్న విషయాలను ఎదుటివారితో పంచుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభనష్టాలుండవు. ఖర్చులకు ఆర్థికంగా లోటుండదు. కంగారు పడనక్కర్లేదు. అనవసరంగా రోజును వేస్ట్ చేశానని నిరుత్సాహపడకండి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం లేదా ఇల్లు వంటి స్థిరచరాస్తుల కొనుగోళ్ల ప్రయత్నాలు ముందుకి సాగుతాయి. రహస్య శత్రువులను కనుగొంటారు. దృష్టిదోషం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story