Thu Sep 12 2024 12:13:18 GMT+0000 (Coordinated Universal Time)
JULY 18 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో తగాదా వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం , వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, మంగళవారం
తిథి : శు. పాడ్యమి రా.2.10 వరకు
నక్షత్రం : పుష్యమి పూర్తిగా..
వర్జ్యం : మ.2.06 నుండి 4.53 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.29 నుండి 9.21 వరకు, రా.11.16 నుండి 12.00 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.1.00 నుండి 1.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. రుణాలు చేస్తారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. తగాదాల వల్ల మేలు కలుగుతుంది. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్తారు. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం వల్ల లాభం పొందుతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో తగాదా వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. అవసరం మేరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్త తీసుకోవాలి. మోసపోయే అవకాశాలున్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేవీ బ్లూ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సమస్యలను పరిష్కరించుకోవడంలో చింత పెరుగుతుంది. తెలియకుండానే సమయం గడిచిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు కలసివస్తాయి. బ్యాంకు నుండి రుణాలు అందుతాయి. బాధ్యతలు తగ్గుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఎవరినీ నమ్మకం పోవడం మంచిది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో ఊరట లభిస్తుంది. రోజంతా ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పాత, కొత్త పరిచయాలు ఉపయోగపడుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా.. నేర్పుగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలిసివస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఎదుటివారి మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడుతారు. నిద్రాహారాలు లోపిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story