Fri Oct 11 2024 08:34:55 GMT+0000 (Coordinated Universal Time)
JULY 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. అభివృద్ధి పథంలో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, సోమవారం
తిథి : అమావాస్య రా.12.02 వరకు
నక్షత్రం : పునర్వసు తె.5.10 వరకు
వర్జ్యం : సా.3.54 నుండి 5.41 వరకు
దుర్ముహూర్తం : మ.12.48 నుండి 1.40 వరకు, మ.3.23 నుండి 4.15 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రకరకాల సౌకర్యాలు అమరుతాయి. రిజిస్ట్రేషన్ల వంటి కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. ఇష్టంలేని వారిని హెచ్చరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అలసట పెరుగుతుంది. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ప్రయాణాలు లాభించవు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంత పెద్ద సమస్య వచ్చినా ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అపార్థాలకు తావివ్వకుండా ప్రతి చిన్న విషయాలను ముందుకి తీసుకెళ్తారు. దంపతుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు కనిపించక ఇబ్బందులు పడతారు. ఆర్థిక విషయాల్లో నిరుత్సాహం పెరుగుతుంది. శత్రుబలం, దృష్టిదోషాలు అధికమవుతాయి. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. పనులు సజావుగా పూర్తవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అధికారులతో సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. అభివృద్ధి పథంలో ముందుకెళ్లేందుకు కొత్తకోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. విద్యార్థులకు అనుకూలం. దైవం మీ పట్ల అనుకూలంగా ఉందనేలా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతున్నారనే విధంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎదుటివారిని వైఫల్యం చెందుతారు. దూకుడుతనం పనికిరాదు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తగా ఆలోచిస్తారు. సంఘ గౌరవం ఉంటుంది. అనవసరంగా మాట్లాడకూడదన్న నిర్ణయాలు తీసుకుంటారు. మీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలన్న స్వభావం అన్నివిధాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. శత్రువుల బలాన్ని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. వేళకు నిద్రాహారాలు సమకూర్చుకుంటారు. భవిష్యత్ పై చింత పెరుగుతుంది. మాటతీరు ఫోర్స్ గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంట్లో చికాకులు తప్పకపోవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. సహోద్యోగులతో ఒడిదుడుకులు ఉంటాయి. ఫైనాన్స్, రాజకీయ, కళా సాహిత్య రంగాల వారికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకానికి దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులివ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. వాగ్వాదానికి తావివ్వొద్దు. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story