Sat Oct 12 2024 05:30:55 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 28 : నేటి పంచాగం, రథసప్తమి రాశిఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. అసాధ్యం కావనుకున్న పనుల్లో కదలికలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : శు.సప్తమి ఉ.8.43 వరకు
నక్షత్రం : అశ్వని ఉ.7.06 వరకు
వర్జ్యం : మ.3.01 నుండి 4.39 వరకు, తె.5.12 నుండి ఉ.6.53 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.43 నుండి 8.13 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.50 నుండి 12.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. టెన్షన్లు ఉన్నా పనులు వేగంగా పూర్తిచేసుకుంటారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. తగాదాతో ముడి పడి ఉన్న ప్రతి అంశంలో మీదే పై చేయి అవుతుంది. రాజకీయ, కళా రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యాల విషయంలో పెద్దల సలహా పాటించడం ఉత్తమం.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. చివరి వరకూ టెన్షన్ పెట్టిన పనులు పూర్తవుతాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మేలు కలుగుతుంది. శుభవార్తలు వింటారు. రహస్యాల్ని తెలుసుకుంటారు. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతున్నాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రంగా ఉంటుంది. అంచనాలు తారుమారవుతాయి. కాంట్రాక్ట్ రంగాలవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య, ఉపాధ్యాయ, న్యాయవాద రంగాలవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. పరిచయాలు విస్తరిస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతాయి.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఎవరికీ ముందుగా హామీ ఇవ్వకపోవడం మంచిది. ఎదుటివారికి మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. సహాయం చేసినా మాట పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇంటర్వ్యూలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానంగా మెలగాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రిస్క్ కు దూరంగా ఉండాలి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. వీలైనంతవరకూ పనులను వాయిదా వేసుకోవడం మంచిది.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. అసాధ్యం కావనుకున్న పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. ఎదుటివారి సహాయ సహకారాలు కలసివస్తాయి. అన్ని వృత్తులు, అన్ని వయసుల వారికి మేలు కలుగుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా, మానసిక సంతృప్తి ఏర్పడుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అప్పులు తీర్చడం, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నలతగా ఉంటుంది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. పనివేళలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మాట పట్టింపులు రాజ్యమేలుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడవచ్చు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్న పనులు.. అనుకున్న స్థాయిలో పూర్తిచేయలేక అసంతృప్తి చెందుతారు. పనులు వాయిదా పడతాయి. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. రిప్రజంటేర్లకు, శారీరకంగా శ్రమించే వారికి మంచి ఫలితాలుంటాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే.. అన్నింటా విజయం సాధిస్తారు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీకు సాయపడేవారు కనిపించరు. అయిపోతుందనుకున్న పని ఎంతకూ పూర్తికాదు. వృద్ధాప్య ఛాయలున్నవారికి అనారోగ్యం తప్పకపోవచ్చు.
Next Story