Wed Mar 04 2026 14:32:06 GMT+0530 (India Standard Time)
Telangana : భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సమర్పించనున్నారు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సమర్పించనున్నారు. ప్రతి శ్రీరామ నవమికి టన్నుల కొద్దీ గోటి తలంబ్రాలను తూర్పు గోదావరి, బాపట్ల ప్రాంతాల నుంచి భక్తులు, మహిళ సంఘాలు ఈ గోటి తలంబ్రాలు భద్రాచలానికి తీసుకు వస్తారు. దీనికి రాములోరికి ముఖ్యమైన సేవగా భక్తులు భావిస్తారు. ఈ గోటి తలంబ్రాలను వరి ధాన్యాలతో అత్యంత భక్తి నిష్టలతో తయారు చేస్తారు.
వడ్లను వొలిచి...
గోటితో వడ్లను వొలిచి బియ్యంపై పట్టు లేకుండా, బియ్యం విరగకుండా ఉపవాస దీక్షలతో ఈ తలంబ్రాలను మహిళలు సిద్ధం చేస్తారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ కృష్ణ చైతన్య సంఘం వంటి ఏటా టన్నుల కొద్దీ గోటి తలంబ్రాలను భద్రాద్రి రాములోరికి సమర్పించుకుంటారు. వాటిని సీతారామ చంద్రుల కల్యాణానికి ఉపయోగిస్తారు. అందుకే గోటి తలంబ్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నెల 27వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా ఈ గోటి తలంబ్రాలను కల్యాణానికి ఉపయోగిస్తారు.
Next Story

