Sun Dec 08 2024 15:32:13 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 7 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తఆలోచనలు పుంజుకుంటాయి. పనులను సరికొత్తగా
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, మంగళవారం
తిథి : బ.విదియ తె.4.28 వరకు
నక్షత్రం : మఖ సా.5.45 వరకు
వర్జ్యం : తె.2.35 నుండి 4.21 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.57 నుండి 9.42 వరకు, రా.11.06 నుండి 11.56 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.55 నుండి 1.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ వివాదాస్పదంగా ఉంటుంది. తప్పు చేయకపోయినా బాధ్యత వహించాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సాధారణంగా కొనసాగుతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నూతన అవకాశాల కోసం ఎదురుచూసేవారు మరింత కృషి చేయాలి. స్థలాల క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక సర్దుబాట్లకు కాలం సహకరిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. పాతపరిచయాలు మరింత బలపడుతాయి. క్రయవిక్రయాలకు సంబంధించిన విషయాలు కలసివస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఎదుటివారితో మాట్లాడేటపుడు రహస్యాలను చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్, క్రీడారంగాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తఆలోచనలు పుంజుకుంటాయి. పనులను సరికొత్తగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. నూతన పరిచయాలు ఉపయోగపడతాయి. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. పనులు వాయిదా పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. శత్రుబలం తగ్గుతుంది. ఇష్టంలేని వ్యక్తులపై ఫిర్యాదులు చేస్తారు. లాభనష్టాలను అంచనా వేసుకుని ముందుకెళ్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తప్పకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. అన్నింటా ప్రశాంతత ఏర్పడుతుంది. పనులు వేగాన్ని పుంజుకుంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. స్త్రీ వర్గంతో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఎవరికి ఏ మాట చెప్పినా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వీలైనంతవరకూ మౌనంగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అపార్థాలు, అపనిందలు రాజ్యమేలుతాయి. ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ముందంజలో ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య తలెత్తిన గొడవలు పరిష్కారమవుతాయి. అగ్రిమెంట్లు ముందంజలో ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story