Mon Dec 09 2024 06:58:10 GMT+0000 (Coordinated Universal Time)
FEBRUARY 14 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ అయినట్టే ఉంటుంది కానీ పూర్తికాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, మంగళవారం
తిథి : బ.అష్టమి ఉ.9.04 వరకు
నక్షత్రం : అనురాధ తె.2.02 వరకు
వర్జ్యం : తె.6.30 నుండి 8.04 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.55 నుండి 9.41 వరకు, రా.11.06 నుండి 11.56 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నట్టుగా రోజు గడిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు, ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు లేత నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. మనసులో ఉన్న మాటను ఎదుటివారితో పంచుకుంటారు. ప్రతి రంగంలో వారి ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కీర్తి, ప్రతిష్టలకు భంగం కలగదు.ఎక్కడ వృథా ఖర్చులవుతున్నాయని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అందంపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అన్నింటా జాగ్రత్తగా ఉండాలి. మంచికిపోతే చెడు ఎదురవుతుందన్న సంఘటనలు చోటుచేసుకుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వారితో మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ అయినట్టే ఉంటుంది కానీ పూర్తికాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. వీలైనంత వరకూ సౌమ్యంగా, తక్కువగా మాట్లాడటం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. ఎదుటివారు ఎలా మాట్లాడినా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మంచిఫలితాలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉపయోగకరమైన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు. సేవింగ్స్ చేయాలనుకుంటారు కానీ.. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని కొంత బాధపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ప్రతీ దానిలో సందేహాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆగిపోయిన పనుల్లో తిరిగి కదలికలు తీసుకొచ్చేందుకు స్నేహాలు ఉపయోగపడతాయి. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కళా, సాహిత్య రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసరమైన విషయాలను పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. చిన్నపాటి ఒడిదుడుకులు, ఖర్చులు ఉన్నా నేర్పుగా వ్యవహరిస్తారు. న్యాయవాదులతో సంప్రదింపులు కలసివస్తాయి. విదేశీ యాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉత్సాహంగా ఉంటారు. పనులు పూర్తయితే అవుతాయి లేదంటే లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య తగాదాలు సమసిపోతాయి. కోర్టు కేసుల విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తగాదాలు పెరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. మొహమాటానికి పనులు చేయడం వల్ల శారీరక అలసట పెరుగుతుంది. ప్రేమలకు దూరంగా ఉండటం మేలు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
Next Story