Wed Apr 01 2026 10:30:51 GMT+0530 (India Standard Time)
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి తీపికబురు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారం వరకూ భక్తుల రద్దీ తక్కువగానే ఉండనుంది. తిరిగి శుక్రవారం నుంచి సోమవారం వరకూ భక్తుల రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో స్వామి వారిని సులువుగానే దర్శనం చేసుకుంటున్నారు. పెద్దగా కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం పూర్తి చేసుకుంటున్నారు.
మరికొద్ది రోజుల్లోనే...
వేసవి రద్దీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే తిరుమలకు భక్తుల రాక ఎక్కువవుతుంది. మరొకవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు తమ ఇళ్లలో చేసుకుని అనంతరం స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారని, దీనివల్ల కొంత భక్తుల సంఖ్య ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వేసవి రద్దీ మొదలయిన వెంటనే వీఐపీ బ్రేక్ దర్శనాలపై నిర్ణయం తీసుకోనున్నామని చెబుతున్నారు.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్వనం కోసం నేడు టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,519 గా ఉంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 21,564 గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

