Thu Dec 25 2025 14:23:07 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల కొండ మీద భక్తులు కిటకట.. సర్వదర్శనం క్యూలైన్ లోకి అనుమతి నిరాకరణ
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించడాన్ని టీటీడీ నిలిపేసింది.తిరుమల భక్త జన సందోహంగా మారింది. వరస సెలవులు రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి, ఉద్యానవనం కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయిభక్తులు నిండిపోవడంతో భక్తులను రేపు ఉదయం సర్వదర్శనం క్యూ లైన్ లోకి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రేపు ఉదయం ఆరు గంటలకు...
రేపు ఉదయం ఆరు గంటలకు మాత్రమే సర్వదర్శనం క్యూ లైన్ లోకి భక్తులను అనుమతిస్తారు. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. అలిపిరి టోల్ గేట్ వద్ద పన్నెండు గేట్లను ఓపెన్ చేసి వాహనాలను తనిఖీలు చేసి తిరుమల కొండపైకి అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్డులో కూడా వెళ్లే దారి అంతా వాహనాలు రద్దీ గా ఉంది. దీంతో కొండ ఎక్కే సమయంలో వాహనాలను నిదానంగా నడపాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు. తిరుమల కొండపై పార్కింగ్ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశముంది.
అలిపిరి టోల్ గేట్ నుంచి...
సర్వదర్శనం టోకెన్లను కూడా కింద తిరుపతిలో నిలిపివేశారు. అన్నదాన ప్రసాద వితరణ మాత్రం నిరంతరాయాంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. తిరుమలకు సంబంధించి భక్తుల తాకిడి కొనసాగుతుంది. చాలా మంది తిరుపతిలోనే అలిపిరి టోల్ గేట్ వద్ద గంటల తరబడి తనిఖీల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా భక్తులు పెరిగిపోవడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. సప్తగిరులు కిటకిటలాడిపోతున్నాయి. రేపు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story

